Home » Vizag News
ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిపై (CS Jawahar Reddy) వరుసగా జనసేన నేత మూర్తి యాదవ్ ( Murthy Yadav) సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఆరోపణలపై సీఎస్ కార్యాలయం నోటీసులు కూడా పంపించింది. అయితే జనసేన నేత మూర్తి యాదవ్ ఏమాత్రం తగ్గకుండా సీఎస్‌పై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు.
విశాఖపట్నం జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్‌కు త్వరలో లీగల్ నోటీస్ జారీ చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి (KS Jawahar Reddy) కార్యాలయం హెచ్చరించింది.
బంగాళఖాతంలో రెమాల్ తుఫాన్ దూసుకొస్తుంది. అర్ధరాత్రి పశ్చిమ బెంగాల్ సమీపంలో తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో 6 గంటల్లో రెమాల్ తుఫాన్ తీవ్రరూపం దాల్చనుందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఉత్తరాంధ్రాలో రెండు వేల కోట్ల అసైన్డ్ భూములను సీఎస్ జవహర్ రెడ్డి (CS Jawahar Reddy) కొట్టేశారని జనసేన (Jana Sena) సీనియర్ నేత పీతల మూర్తి యాదవ్ (Murthy Yadav) ఆరోపించారు. రాష్ట్రంలో ఎన్నికల హింస మీద విచారణ జరుగుతుంటే ఆయన విశాఖ వచ్చి భూ వ్యవహారాలు చేస్తున్నారని విమర్శించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ ఆసైన్డ్ భూములు ఎక్కువుగా ఉన్నాయన్నారు. భూముల మార్పిడి జీవో 596.. ఆ జీవో ఆధారంగా భూములు కొట్టేశారని ఆరోపించారు.
విద్యాబుద్దులు నేర్పాల్సిన ఓ ప్రొఫెసర్ కాలేజీలోని విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. ఎన్ని చట్టాలు వస్తున్న మాత్రం ఇలాంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు. వివరాల్లోకి వెళ్తే... భీమిలి మండలం సంగివలన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో రేడియాలజీ ప్రొఫెసర్ టి. నాగేశ్వరరావు విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ దిశ పొలీస్ స్టేషన్లో విద్యార్థినులు ఫిర్యాదు చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Election 2024) తాము 175 స్థానాల్లో గెలుస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9న విశాఖపట్నంలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారని ఉద్ఘాటించారు. విజయనగరం జిల్లాలో మరోసారి తొమ్మిదికి తొమ్మిది గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.
సైబర్ నేరాల బారినపడి కంబోడియాలో (Cambodia) చిక్కుకున్న భారతీయులను మన ఎంబసీ అధికారులు రక్షించారు. తాజాగా మరో 60 మంది భారతీయులను కాపాడారు. దీంతో ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 150 మంది చైనా గ్యాంగ్ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు.
ఎండలు మండిపోతున్న వేళ విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం చల్లటి కబురు చెప్పింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది క్రమంగా బలపడి తీవ్రవాయుగుండంగా.. ఆ తర్వాత తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయి.
స్ట్రాంగ్ రూమ్ భద్రతపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ మరోసారి సందేహాలు లేవనెత్తారు. ఈవీఎం స్టోర్ చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రతపై తమకు అనుమానాలు ఉన్నాయన్నారు. స్ట్రాంగ్ రూమ్‌కు సంబంధించి లైవ్ లింక్ ఇవ్వాలని కోరారు. సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని ఆర్వోని అడిగామని తెలిపారు. గతంలో లైవ్ లింక్ ఇచ్చారనే విషయాన్ని కేఏ పాల్ గుర్తుచేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో(AP Elections 2024) ఓడిపోతామనే భయంతోనే వైఎస్సార్సీపీ (YSRCP) కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) కూటమి గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు.