Share News

Purandareshwari: వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం

ABN , Publish Date - Jul 15 , 2024 | 09:01 PM

కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పరస్పరం సమన్వయంతో ముందుకుపోవడం వల్లే ఈ భారీ విజయం సాధించామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి (Purandareshwari) తెలిపారు.

Purandareshwari: వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధి శూన్యం
Purandareshwari,

విశాఖపట్నం: కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ పరస్పరం సమన్వయంతో ముందుకుపోవడం వల్లే ఈ భారీ విజయం సాధించామని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి (Purandareshwari) తెలిపారు. ఈరోజు (సోమవారం) బీజేపీ ప్రజాప్రతినిధుల అభినందన సభ నిర్వహించారు. ఈ సభకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. గత ప్రభుత్వంలో సంక్షేమం తప్ప అభివృద్ధి శూన్యమని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి తప్ప రోడ్లు, పరిశ్రమలు, ఉద్యోగాలు లేవని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నప్పటికి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పురందరేశ్వరి పేర్కొన్నారు.


ALSO Read: Bhupathi Raju: కేంద్రం ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో తేలడం లేదు..

జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారు: సత్యకుమార్

గత ప్రభుత్వ పరిపాలనలో ప్రజలు విసిగిపోయారని.. దీంతో కూటమికి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారీ విజయాన్ని ప్రజలు అందించారని ఆరోగ్యశాఖామంత్రి సత్యకుమార్ తెలిపారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదంటే జగన్ పాలనతో ప్రజలు ఎంత విసిగిపోయరో అర్థం అవుతుందని అన్నారు. అన్నీ శాఖలను పూర్తిగా వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్‌గా జగన్ మార్చేశారని విమర్శించారు.మళ్లీ సీఎం అయ్యి రుషికొండ మీద కట్టుకున్న విలాసవంతమైన భవనంలో ఉందామనుకున్నారని అన్నారు. కానీ ప్రజలు ఇచ్చిన షాక్‌కి జగన్‌కి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందని విమర్శించారు.వైసీపీ నేతలు చాలా మంది అవినీతి చేశారని తప్పు చేసిన వారిని వదలమని హెచ్చరించారు. కేంద్రం నిధులు ఇస్తే ప్రతి పథకానికి జగన్ పేరు పెట్టుకున్నారని ధ్వజమెత్తారు.


వాళ్లకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం: శ్రీనివాస వర్మ

తనకు ఎంపీ టికెట్ ఇవ్వవద్దని తమ పార్టీలో కొంతమంది నేతలు అడ్డుకున్నారని కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు. పార్లమెంటు టికెట్ కావాలంటే రూ. 100కోట్లు కావాలని, అంత మొత్తం తన దగ్గర లేదని.. తనను రూ. 100 కోట్లతో సమానమైన కార్యకర్తలు గెలిపించారని చెప్పారు. పార్టీ కార్యక్రమాల కోసం తన ఆస్తిని అమ్ముకొని చేసే వ్యక్తిని తానని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో తమను ఇబ్బంది పెట్టిన వాళ్లకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం, ఎవరిని వదలిపెట్టమని శ్రీనివాస వర్మ హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి:

Home Minister Anitha: ఆ కుటుంబాలకు రూ.5లక్షలు చొప్పున పరిహారం..

Minister Dola: ఆ సంఘటనపై దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తాం: మంత్రి డోలా

Updated Date - Jul 16 , 2024 | 02:28 PM