Home » Vote
ఏపీలో నకిలీ ఓట్ల అంశం క్రమంగా మరింత వేడెక్కుతోంది. 2021 తిరుపతి ఎంపీ ఎన్నికల్లో ఫేక్ ఓట్లు ఉన్నాయని తేలడంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశా సస్పెండ్‌ను సస్పెండ్ చేశారు. దీంతో ప్రస్తుతం దొంగ ఓట్ల అంశం గురించి రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున దుమారం రేపుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే నకిలీ ఓట్ల అంశం కలకలం రేపుతోంది. ఎంతలా అంటే ఒకే పేరుతో ఉన్న వ్యక్తుల ఓట్లు ఐదారు నియోజకవర్గాల్లో ఉన్నాయి.
AP Bogus Votes Issues : ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయ్. 2019 ఎన్నికల్లో అడ్డదిడ్డమైన హామీలతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఈ నాలుగున్నరేళ్లలో ఏ మేరకు పరిపాలన సాగింది..? ప్రజలకు ఇచ్చిన హామీలు వైఎస్ జగన్ ఏ మేరకు అమలు చేశారు..? అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. ఈ విషయాలన్నీ ఏపీ ప్రజలకు బాగా తెలుసు కూడా..
AP Bogus Voters Issue: ఎన్నికల అధికారులు.. ఏదైనా ఒక పార్టీకో.. ఎవరైనా ఒక అభ్యర్థికో అనుకూలంగా వ్యవహరిస్తే సహించేది లేదు.. అలాంటి వారిపై తీవ్రమైన చర్యలుంటాయి.. ఇవే ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషన్ పదే పదే చెప్పే మాటలు. అయితే.. ఏపీలో అధికార వైసీపీ ఎన్నికలకు ముందే బోగస్ ఓట్ల విషయంలో దారుణాతి దారుణాలు పాల్పడుతుంటే ఇంతవరకూ చలీచప్పుడు లేదు..
AP Election 2024: అధికారం మనదే.. మనం చెప్పిందే వేదం.. చేసిందే శాసనం..! అడ్డుకునేదెవరు.. ఢీ కొనేదెవరు..? పదండి ముందుకు.. ఏం జరిగినా సరే.. ఇంకేదైనా చేసయినా సరే గెలిచి తీరాలంతే.. అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ (YSRCP) తీరు ఉంది. ఇందుకు ఎన్నికల ముందు మూడో కంటికి తెలియకుండా వైసీపీ చేపడుతున్న కార్యకలాపాలే నిదర్శనం..
Andhrapradesh: ఆత్మకూరు నియోజకవర్గంలో ఓట్లు తొలగించేందుకు ప్రయత్నించిన నలుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫామ్- 7 ద్వారా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు ఫిర్యాదు చేసిన నలుగురుపై కేసు నమోదు అయ్యింది.
ఓటు హక్కు కలిగి ఉండడం ప్రతీ పౌరుడి బాధ్యత. ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది. 18 ఏళ్లు నిండిన ప్రతి వారు ఓటు నమోదు చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? ఏపీ ఓటర్లకు బిగ్ అలర్ట్ న్యూస్.
Telangana polls: మరికొద్దిసేపటిలో తెలంగాణ పోలింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే పోలింగ్‌కు సర్వసిద్ధమైంది. సుమారు 3.26కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
మన పేరుతో వేరొకరు ఓటేస్తే ఏం చేయాలన్న ప్రశ్న అందరికీ తలెత్తుతుంది. అయితే దీనికి ఎన్నికల సంఘం ఒక పరిష్కారం చూపించింది. అదెలాగంటే..
Voter List: ఓటు వేసేందుకు తాము అర్హులమా? కాదా? ఓటరు జాబితాలో తమ పేరు ఉందా? లేదా? అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీనికి కావాల్సింది ఓటర్ల వ్యక్తిగత EPIC నంబర్.