AP News: ఆత్మకూరులో ఓట్లు తొలగించేందుకు యత్నించిన నలుగురిపై కేసు నమోదు
ABN , Publish Date - Jan 09 , 2024 | 10:42 AM
Andhrapradesh: ఆత్మకూరు నియోజకవర్గంలో ఓట్లు తొలగించేందుకు ప్రయత్నించిన నలుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫామ్- 7 ద్వారా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు ఫిర్యాదు చేసిన నలుగురుపై కేసు నమోదు అయ్యింది.
నెల్లూరు, జనవరి 9: ఆత్మకూరు నియోజకవర్గంలో ఓట్లు తొలగించేందుకు ప్రయత్నించిన నలుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫామ్- 7 ద్వారా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేందుకు ఫిర్యాదు చేసిన నలుగురుపై కేసు నమోదు అయ్యింది. సంగం మండలం చెన్నవరపాడు గ్రామంలో ఫామ్ -7 ద్వారా 130 ఓట్లు తొలగించాలని వైసీపీ నాయకుడు చంద్రమౌళి ఫిర్యాదు చేశాడు.
సంగం మండలం తలుపుల పాడు గ్రామంలో ఫార్మ్- 7 ద్వార 14 ఓట్లు తొలగించేందుకు మరో వైసీపీ నేత బీఎల్‌ఓ చాంద్ బాషా ఫిర్యాదు చేశాడు. అలాగే ఏఎస్ పేట మండలం శ్రీ కోలను గ్రామంలో ఫామ్- 7 ద్వార 130 ఓట్లు తొలగించేందుకు వైసీపీ నాయకుడు కాకి ప్రసాద్ రెడ్డి, చేజర్ల మండలం ఉలవపల్లి గ్రామంలో ఫామ్- 7 ద్వారా 75 ఓట్లు తొలగించేందుకు వైసీపీ నేత బీఎల్ఓ శ్రీనివాసులు రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఈ నలుగురిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...