Home » Vote
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో నానా గందరగోళం సృష్టించడానికి జగన్ సర్కారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎన్నికల కమిషన్ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ నేతలు హైకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు. దీంతో వారి కన్ను సర్వీసు ఓట్లపై పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి.
దేశంలో 7 దశల్లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కరెన్సీ పరుగులు పెట్టింది. ఓటర్లపై నోట్ల వర్షం కురిసింది. దీంతో గతంలో ఎన్నడూ లేనంతగా అత్యంత ఖరీదైన ఎన్నికలుగా ఈ ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. తాజా ఎన్నికల్లో దాదాపు రూ.1.35 లక్షల కోట్లు ఖర్చయినట్టు సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ వెల్లడించింది. దీని ప్రకారం ఒక్కో ఓటుకు రూ.1,400 ఖర్చు చేసినట్టు ఈ సంస్థ
జిల్లాలో ఓట్ల కౌంటింగ్(Counting of votes)కు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ మల్లికార్జున(Collector Mallikarjuna), విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్(Visakha CP Ravi Shankar) తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీలో కౌంటింగ్ కోసం ఏడు హాళ్లు ఏర్పాటు చేశామని, ఒక కౌంటింగ్ కేంద్రానికి 14టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల కోసం మరొక ఏడు టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మల్లికార్జున్ తెలిపారు.
దాదాపు ఏడు వారాలుగా కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల రణరంగానికి ఇక తెర పడనుంది. ఏడు దశలుగా జరుగుతున్న ఎన్నికల్లోని చివరి దశకు పోలింగ్ శనివారం జరగనుంది. ఈ దశలో
మచిలీపట్నంలోని కృష్ణావర్శిటీ(Krishna University)లో ఏర్పాటు చేసిన ఓట్ల కౌంటింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా(CEO MK Meena) సందర్శించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద అధికారులు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు.
దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకుంది. శనివారం ఏడో విడత పోలింగ్‌తో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఎన్నికల ఫలితాల కోసం జూన్4 వరకు నిరీక్షించాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు.. నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఒడిశాలో మాత్రం..
సార్వత్రిక ఎన్నికల ప్రకటన మార్చి 16 నుంచి దేశవ్యాప్తంగా మొదలైన ఎన్నికల (lok sabha election 2024) సందడి ఈరోజు సాయంత్రం అంటే మే 30న సాయంత్రం 5 గంటలకు ఆగిపోనుంది. దీంతో లోక్‌సభ ఎన్నికల చివరి దశ(7th phase) ప్రచారానికి తెరపడనుంది. దీనికి సంబంధించి జూన్ 1న ఓటింగ్ జరగనుంది.
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరో దశలో 63.37ు పోలింగ్ నమోదైనట్టు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) మంగళవారం ప్రకటించింది. ఈసీ గణాంకాల ప్రకారం.. ఎనిమిది రాష్ట్రాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు మే 25న జరిగిన పోలింగ్‌లో 7.05 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు వేశారు. ఓటు హక్కును
బ్యాలెట్ పేపర్ వెనక రిటర్నింగ్ అధికారి సంతకమున్నా సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ ఇన్వ్యాలిడ్ చేయకూడదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. రిటర్నింగ్ అధికారి సంతకానికి, బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని సీఈవో స్పష్టం చేశారు. పోస్టల్ బ్యాలెట్ డిక్లరేషన్‌పైనా గెజిటెడ్ అధికారి సంతకం ఉంటే సీల్ లేదని వాటిని ఇన్‌వ్యాలిడ్‌గా పరిగణించకూడదని పేర్కొన్నారు. ఓటర్ తమ ఓటును బ్యాలెట్ పేపర్లో సక్రమంగా వేశారా? లేదా? అని మాత్రమే చూడాలని ఆదేశించారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్‌లోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలోని పోలింగ్ బూత్‌లో ద్రౌపదీ ముర్ము ఓటు వేశారు.