LokSabha Elections: ఓటేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
ABN , Publish Date - May 25 , 2024 | 02:55 PM
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్‌లోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలోని పోలింగ్ బూత్‌లో ద్రౌపదీ ముర్ము ఓటు వేశారు.
న్యూఢిల్లీ, మే 25: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి భవన్ కాంప్లెక్స్‌లోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ కేంద్రీయ విద్యాలయంలోని పోలింగ్ బూత్‌లో ద్రౌపదీ ముర్ము ఓటు వేశారు. మహిళా ఓటర్ల కోసం.. మహిళ సిబ్బందితో ఈ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
న్యూఢిల్లీలో మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. వాటిలో రాష్ట్రపతి భవన్.. న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. గతేడాది నవంబర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. కొత్త ఓటర్ ఐడీ కార్డు తీసుకున్నారు. అంతకుముందు ఆమెకు ఒడిశా చిరునామాతో ఓటర్ ఐడీ కార్డు ఉండేది. దానిని అప్ డేట్ చేయించుకున్నారు. ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ము.. 2022, జులై 25న భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు.
సావిత్రి జిందాల్..
మరోవైపు బీజేపీ నాయకురాలు, భారత్‌లో సంపన్న మహిళ సావిత్రి జిందాల్.. హరియాణాలోని హిస్సార్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం సావిత్రి జిందాల్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు. వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ఎన్నికవుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
అయితే సావిత్రి జిందాల్ కుమారుడు నవీన్ జిందాల్.. కురుక్షేత్ర లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈ ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో అంటే 2004, 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎంపీగా గెలుపొందారు. కానీ ఈ ఏడాది మార్చిలో వారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు.
Read National News and Latest News here