Sixth Phase Polling : లోక్‌సభ ఎన్నికల ఆరో దశలో 63.37% పోలింగ్
ABN , Publish Date - May 29 , 2024 | 05:53 AM
లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరో దశలో 63.37ు పోలింగ్ నమోదైనట్టు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) మంగళవారం ప్రకటించింది. ఈసీ గణాంకాల ప్రకారం.. ఎనిమిది రాష్ట్రాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు మే 25న జరిగిన పోలింగ్‌లో 7.05 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు వేశారు. ఓటు హక్కును
ఓటు వేసిన 7.05 కోట్ల మంది
న్యూఢిల్లీ, మే 28 : లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరో దశలో 63.37ు పోలింగ్ నమోదైనట్టు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) మంగళవారం ప్రకటించింది. ఈసీ గణాంకాల ప్రకారం.. ఎనిమిది రాష్ట్రాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు మే 25న జరిగిన పోలింగ్‌లో 7.05 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు వేశారు. ఓటు హక్కును వినియోగించుకున్న వారిలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారు. ఆరో దశలో మొత్తం ఓటర్లలో 61.95ు పురుషులు ఓటు వేయగా.. వారితో పోలిస్తే 3ు అధికంగా 64.95ు మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం వాటాలో పురుషుల కంటే మహిళలు అధికంగా ఉండడం ఈ ఎన్నికల్లో ఇది రెండో సారి. ఐదో దశ పోలింగ్‌లోనూ పురుషుల(61.48ు) కంటే మహిళా(63ు) ఓటర్ల శాతమే అధికంగా నమోదైంది. ఇక, ఆరో దశలో ఝార్ఖండ్‌లో 65.94ు మంది మహిళలు, 51.31ు పురుషులు ఓటు వేశారు. పశ్చిమ బెంగాల్‌లో 83.83ు మంది మహిళలు, 81.62ు మంది పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఒడిసాలోనూ పురుషులు(74.07ు) కంటే మహిళలు(74.86ు) ఓట్ల శాతంలో స్వల్ప ఆధిక్యంతో ముందు నిలిచారు. బిహార్‌లో 62.95ు మంది మహిళలు, 51.95ు మంది పురుషులు ఓట్లు వేశారు. ఇక, ఢిల్లీలో మొత్తం 58.69ు పోలింగ్ నమోదవ్వగా ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో 59.03ు పురుషులు, 58.29ు మహిళలు, 28.01ు థర్డ్ జెండర్ వారు ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా భారతదేశంలో 96.88 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటిదాకా ఆరు దశల్లో పోలింగ్ జరగ్గా ఆయా ప్రాంతాల్లోని మొత్తం 87.54 కోట్ల మంది ఓటర్లలో 57.77 కోట్ల మందే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈసీ గణాంకాల ప్రకారం తొలి దశలో 66.14ు పోలింగ్ నమోదైంది. అలా గే, రెండో దశలో 66.71, మూడో దశలో 65.68, నాలుగో దశలో అత్యధికంగా 69.16, ఐదో దశలో 62.2ు పోలింగ్ నమోదైంది. కాగా, చివరి, ఏడో దశలో 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.