Home » Washington
భారత్-రష్యా భాగస్వామ్య ఒప్పందాలు, ఇరు దేశాల మధ్య స్నేహం వంటి కీలక విషయాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. రష్యాతో భారత్ బంధంపై తాము ఆందోళన చెందుతున్నామని చెబుతూనే.. భారత్‌ను తాము వ్యూహాత్మక భాగస్వామ్య దేశంగానే పరిగణిస్తున్నట్టు తెలిపింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా జో బైడెన్ స్థానంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామాను బరిలో నిలుపుతారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ముంగిట మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వలస విధానాన్ని ప్రతిపాదించారు. అమెరికా కళాశాలల్లో చదివే విదేశీ విద్యార్థులందరికీ గ్రీన్‌కార్డు(శాశ్వత నివాస కార్డు)లు మంజూరుచేస్తామని ప్రకటించారు.
ప్లాస్టిక్ భూతం సర్వవ్యాప్తమైపోయింది. చివరికి మన శరీరంలోకీ వ్యాపించింది. సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులు (మైక్రో ప్లాస్టిక్స్) మనిషి దేహంలోని అన్ని అవయవాలను ఆక్రమించేస్తున్నాయి.
మీరు సెర్చింజన్ దిగ్గజం గూగుల్ బ్రౌజర్ క్రోమ్‌ను వాడుతున్నారా? అయితే.. ఇకపై ఎంచక్కా మీరు మీ మొబైల్లో వెబ్ పేజీలను ఆడియో రూపంలో వినొచ్చు. అంతేకాదు.. టేప్‌రికార్డర్, మ్యూజిక్ ప్లేయర్ మాదిరిగా.. రివైండ్, ఫార్వర్డ్, పాస్ వంటి ఆప్షన్లను కూడా వాడుకోవచ్చు.
కంపెనీలు తమ ఉత్పత్తులను అన్ని వేళలా నడపాలనే ఉద్దేశంతో ఉద్యోగులను నైట్ షిఫ్ట్‌లో(Night Shift Duties) పనులు చేయిస్తుంటాయి. అయితే వరుసగా 3 రోజులు నైట్ షిప్టులు చేస్తే జరిగే ప్రమాదలను తెలియజేస్తూ వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఓ జర్నల్‌ని ప్రచురించారు.
అమెరికా ప్రభుత్వాన్ని కూలదోసి, నాజీ ప్రభుత్వాన్ని నెలకొల్పే ఉద్దేశంతో వైట్‌హౌ్‌సపై దాడికి పాల్పడినట్లు భారత సంతతికి చెందిన సాయి వర్షిత్ కందుల(20) అంగీకరించాడు.
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్(58) ముచ్చటగా మూడోసారి అంతరిక్ష యాత్రకు సిద్ధమయ్యారు. మరో వ్యోమగామి బుచ్ విల్మోర్తో కలిసి బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్ వ్యోమనౌకలో ఆమె రోదసీలోకి వెళ్లనున్నారు.
పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్, నిషేధిత ఖలిస్థానీ వేర్పాటు సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్‌కు చెందిన ఉగ్రవాది గోల్డీబ్రార్ బతికే ఉన్నట్లు అమెరికా పోలీసులు వెల్లడించారు.
గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకేసులో కీలక నిందితుడు, బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ ఉగ్రవాది గోల్డీ బ్రార్(30) అమెరికాలో హత్యకు గురయ్యాడు.