Share News

రష్యాకు సాయంపై అమెరికా కన్నెర్ర

ABN , Publish Date - Nov 02 , 2024 | 03:29 AM

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యాకు సాయం చేస్తున్న కంపెనీలు, వ్యక్తులపై అమెరికా కన్నెర్ర చేసింది. 400 సంస్థలు సహా వ్యక్తులపై ఆంక్షలు విధించింది.

రష్యాకు సాయంపై అమెరికా కన్నెర్ర

  • 400 సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు..జాబితాలో భారత సంస్థలు

వాషింగ్టన్‌, నవంబరు 1: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో రష్యాకు సాయం చేస్తున్న కంపెనీలు, వ్యక్తులపై అమెరికా కన్నెర్ర చేసింది. 400 సంస్థలు సహా వ్యక్తులపై ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో భారత్‌, చైనా, టర్కీ, థాయ్‌లాండ్‌, మలేషియా, దుబాయ్‌ దేశాలకు చెందిన కంపెనీలు, వ్యక్తులు ఉన్నారు. ఈ మేరకు అమెరికా విదేశాంగ, వాణిజ్య, ఆర్థిక శాఖలు వేర్వేరుగా ఆంక్షలు విధించాయి. విదేశాంగ శాఖ 120 సంస్థలు, వ్యక్తులపై ఆంక్షలు విధించగా, ఆర్థిక శాఖ 270 సంస్థలు, వ్యక్తులపై, వాణిజ్య శాఖ 40 మంది వ్యక్తులు, సంస్థలపై విడివిడిగా ఆంక్షలు విధించాయి. ఆయా వ్యక్తులు, కంపెనీల నుంచి రష్యా ‘అక్రమ యుద్ధానికి’ అందుతున్న సాంకేతికత, పరికరాలు, ఇతర సహాయక చర్యలకు బ్రేకులు వేయడమే ఈ ఆంక్షల ప్రధాన ఉద్దేశమని అమెరికా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘‘రష్యా సైన్యానికి ఏ రూపంలో సాయం అందినా దానిని నిర్వీర్యం చేయాలన్నది అమెరికా లక్ష్యం’’ అని అమెరికా స్పష్టం చేసింది.

Updated Date - Nov 02 , 2024 | 03:29 AM