Home » West Bengal
కోల్‌కతాలోని ఆర్జి కర్ వైద్య కళాశాలలో జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమకు న్యాయం చేయాలని, భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ వైద్యులు ఆందోళన చేస్తున్నారు.
నా బిడ్డ చనిపోవడంతో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వీధుల్లోకి వచ్చి చాలా బాగా మాట్లాడారు. నా బిడ్డ మృతికి న్యాయం జరగాలని ఆందోళన కూడా చేపట్టారు. అదే సమయంలో ప్రజల ఆగ్రహాన్ని అణచి వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎందుకు ద్వంద్వ విధానం అమలు చేస్తున్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై మృతురాలి తండ్రి ప్రశ్నల వర్షం కురిపించారు.
కోల్ కతా వైద్యురాలి మృతి యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ వినిపిస్తోంది. మృతురాలికి న్యాయం జరగాలని, వీలైనంత త్వరగా నిందితుడిని ఉరి తీయాలని యావత్ దేశం కోరుకుంటోంది. ఇదే అంశంపై ప్రముఖులు స్పందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్, సీఎం మమతా బెనర్జీకి మాజీ క్రికెటర్, ఆప్ ఎంపీ హర్బజన్ సింగ్ రెండు పేజీల బహిరంగ లేఖ రాశారు.
కోల్‌కతా రేప్ అండ్ మర్డర్ కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరిస్తూ ఆదివారం నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న ఈ కేసును విచారించనుంది.
సంచలనం సృష్టించిన కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం, హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఈ ఘటనపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారనే అభియోగంపై ప్రశ్నించేందుకు బీజేపీ నేత లాకెట్ ఛటర్జీకి కోల్‌కతా పోలీసులు ఆదివారంనాడు సమన్లు పంపారు.
ఈస్ట్ బెంగాల్ వెర్సస్ మోహన్ బాగాన్ డెర్బీ జట్ల మధ్య ఆదివారం జరగాల్సిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను పశ్చిమబెంగాల్ ప్రభుత్వం రద్దు చేసింది. మ్యాచ్‌కు తగిన భద్రత కల్పించలేమని కోల్‌కతా పోలీసులు అసక్తత వ్యక్తం చేయడంపై బీజేపీ మండిపడింది.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనను ఖండిస్తూ నిరసనలు కొనసాగుతుండటంతో కోల్‌కతా పోలీసులు శాంతిభద్రతల దిశగా చర్యలకు దిగారు. మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ చుట్టుపక్కల 7 రోజుల పాటు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-2023 చట్టం కింద సెక్షన్ 163 (గతంలో సీఆర్పీసీ సెక్షన్ 144)ని విధించారు.
కోల్‌కతా ఆర్జీ కార్ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం ఘటనను తీవ్రంగా నిరసిస్తూ రాష్ట్రంలోని వైద్య సంఘాలు శనివారం భారీఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాయి.
డాక్టర్లు, ఇతర ఆరోగ్య సిబ్బంది భద్రతకు తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. సంబంధిత నిపుణులు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాలను కమిటీకి తెలపవచ్చునని వెల్లడించింది.
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో మహిళా ట్రైనీ డాక్టరుపై అత్యాచారం, హత్య ఘటనకు సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో పశ్చిమబెంగాల్ ప్రభుత్వం అనూహ్య చర్యకు దిగింది. సుమారు 43 మంది డాక్టర్లను బదిలీ చేస్తూ శనివారంనాడు ఆదేశాలు జారీ చేసింది.