Home » West Bengal
పేరులో ఏముంది అని చాలా మంది అనుకుంటారు. కొన్నిసార్లు ఆ పేరే వివాదాలకు కారణమవుతుంది. ఇలాంటి ఘటనే గత కొంతకాలంగా కొనసాగుతోంది. పశ్చిమబెంగాల్ రాష్ట్రం శిలిగుడి సఫారీ పార్క్‌లో ఉన్న రెండు సింహాల గురించే ఇదంతా.
పశ్చిమ బెంగాల్‌ను విభజించే అన్ని ప్రయత్నాలను తృణమూల్ కాంగ్రెస్ తిప్పికొడుతుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. బెంగాల్‌ను విభజించేందుకు వారిని రానివ్వండి.. ఎలా అడ్డుకోవాలో తనకు బాగా తెలుసని దీదీ పేర్కొన్నారు.
శ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ నుంచి ఆ పార్టీలోని కింద స్థాయి నేతలు వరకు అందరిని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల సందేశ్‌కాలీలో టీఎంసీ నేత షేక్ షాజహాన్, చోప్రాలో టీఎంసీ నేత తాజ్‌ముల్‌ల వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తాయి.
కేంద్ర బడ్జెట్లో పశ్చిమ బెంగాల్‌కు నిధుల కేటాయింపులో వివక్ష, రాష్ట్ర విభజన ప్రయత్నాలపై నిలదీస్తానంటూ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన ఆ రాష్ట్ర సీఎం మమత మధ్యలోనే వాకౌట్ చేశారు.
కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రాలకు కేటాయింపుల్లో 'వివక్ష' చూపారంటూ విమర్శలు చేస్తున్న విపక్షాలు ఈసారి 'నీతి ఆయోగ్' లో ఆ విషయాన్ని లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నారు. శనివారంనాడు ఢిల్లీలో జరిగే ''నీతి ఆయోగ్'' సమావేశంలో పశ్చిమబెంగాల్ పట్ల చూపుతున్న రాజకీయ వివక్షపై నిరసన తెలపనున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ చెప్పారు.
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం కోర్ట్ కొలీజియం.. కలకత్తా హైకోర్టులోని పలువురు న్యాయమూర్తుల పదవీ కాలాన్ని పొడగించాలని నిర్ణయించింది. హైకోర్టులో పని చేస్తున్న తొమ్మిది మంది అదనపు న్యాయమూర్తుల పని వేళలను సైతం ఏడాదిపాటు పొడగించాలని సిఫార్సు చేసింది.
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల సంస్కరణల కోసం హింస చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆ దేశంలోని హింసతో బాధితులుగా మారిన వారికి కోల్‌కతాలో ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇటీవల ప్రకటించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2024-25పై పశ్చిమబెంగాల్ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. దిశానిర్దేశం లేని, ప్రజావ్యతిరేక, రాజకీయ పక్షపాత బడ్జెట్ అని అభివర్ణించారు.
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల సంస్కరణలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దాంతో దేశంలో కర్ఫ్యూ విధించారు. అయినా అల్లర్లు మాత్రం అదుపులోకి రావడం లేదు.
రిజర్వేషన్ల సంస్కరణ కోసం జరుగుతున్న అల్లర్లతో బంగ్లాదేశ్ అతలాకుతలం అవుతుంది. హింసాత్మక ఘటనలను అడ్డుకొనేందుకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినా.. ఆ దేశంలో అల్లర్లు మాత్రం ఆగడం లేదు.