Share News

West Bengal: మహిళ ఫిర్యాదు.. టీఎంసీ మరో నేత అరెస్ట్

ABN , Publish Date - Jul 28 , 2024 | 04:50 PM

శ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ నుంచి ఆ పార్టీలోని కింద స్థాయి నేతలు వరకు అందరిని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల సందేశ్‌కాలీలో టీఎంసీ నేత షేక్ షాజహాన్, చోప్రాలో టీఎంసీ నేత తాజ్‌ముల్‌ల వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తాయి.

West Bengal: మహిళ ఫిర్యాదు.. టీఎంసీ మరో నేత అరెస్ట్

కోల్‌కతా, జులై 28: పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ నుంచి ఆ పార్టీలోని కింద స్థాయి నేతలు వరకు అందరిని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల సందేశ్‌కాలీలో టీఎంసీ నేత షేక్ షాజహాన్, చోప్రాలో టీఎంసీ నేత తాజ్‌ముల్‌ల వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Also Read: Viral Video: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశం.. వీడియోలో వివరించిన యూట్యూబర్ ?


టీఎంసీ ప్రధాన కార్యదర్శి గోపాల్ తివారీ..

తాజాగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గోపాల్ తివారీ సైతం వార్తల్లో నిలిచారు. పశ్చిమ బెంగాల్‌లోని కల్నాలో మహిళపై ఆయన దాడి చేశాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వీడియో ఆధారంగా.. మహిళ ఫిర్యాదు మేరకు గోపాల్ తివారీని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వివరించారు. ఫిర్యాదు చేసిన మహిళ నివాసం పక్కన ఖాళీ స్థలంలో గోపాల్ తివారీ ప్రహరి నిర్మించే క్రమంలో వీరి మధ్య ఘర్షణ తలెత్తిందని పోలీసులు తెలిపారు. అయితే తన ఇంట్లోకి గోపాల్ తివారీ ప్రవేశించి.. తనపై దాడి చేశారని ఆమె ఆరోపించింది. అలాగే అతడి అనుచరులు తన కుమార్తెతోపాటు తన అత్తపై దాడి చేశారని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

Also Read: Rahul Gandhi: సివిల్స్ ఆశావహులు మృతి.. మూల్యం చెల్లించుకుంటున్న సామాన్యుడు


మొన్న సందేశ్‌కాలీ.. నిన్న చోప్రా

పశ్చిమ బెంగాల్‌లోని దేశ సరిహద్దు ప్రాంతంలో సందేశ్‌కాలీ కుగ్రామం. ఈ గ్రామంతోపాటు పరిసర గ్రామాలపై టీఎంసీ నేత షాజహాన్ అజమాయిషీ చెలాయిస్తున్నాడు. ఆ క్రమంలో అతడి కారణంగా సందేశ్‌కాలీలో చోటు చేసుకున్న అక్రమాలు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాయి. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మమతా బెనర్జీ పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థి బీజేపీకి ఇదే అంశం ప్రచార ఆస్త్రంగా మలుచుకుంది. ఇక పశ్చిమ బెంగాల్‌లోని చోప్రాలో ఓ వ్యక్తితో మహిళ అక్రమ సంబంధం పెట్టుకుంది.

ఈ నేపథ్యంలో నడిరోడ్డుపై వారిద్దరిపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేత తజుముల్ విచక్షణారహితంగా దాడి చేశాడు. అందుకు సంబంధించిన వీడియోలు.. అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఈ ఘటనపై బీజేపీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు...ఈ ఘటనపై ఆ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం సైతం స్పందించింది. ఆ క్రమంలో రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేతల అరాచకాలకు అడ్డు అనేది లేకుండా పోయిందనే విమర్శులు సైతం వెల్లువెత్తాయి. తాజాగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గోపాల్ తివారీ వ్యవహారంతో మరోసారి ఆ పార్టీ నేతల ఆగడాలు వెలుగులోకి వచ్చినట్లు అయింది.


ఓ వైపు బంగ్లాదేశ్‌లో హింసా.. మరోవైపు సీఎం మమత ప్రకటన...

మరోవైపు.. బంగ్లాదేశ్‌‌లో రిజర్వేషన్లు సంస్కరించాలంటూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. వారికి ప్రజల మద్దతు తోడయింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దాంతో దేశ్యావ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. అలాంటి వేళ.. బంగ్లాదేశ్ హింసతో బాధితులుగా మారిన వారు బెంగాల్ వస్తే ఆశ్రయం కల్పిస్తామంటూ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. ఈ ప్రకటనపై బంగ్లాదేశ్ కాస్తా ఘాటుగా స్పందించింది. ఇక కేంద్రంలోని బీజేపీ అయితే సీఎం మమత వ్యాఖ్యలపై మండిపడింది.

Read More National News and Latest Telugu News

Updated Date - Jul 28 , 2024 | 04:50 PM