Home » West Bengal
రెమాల్ తుపాన్ పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ఐలాండ్, బంగ్లాదేశ్‌లోని కీపుపారా మధ్య తీరాన్ని దాటింది. అయితే ఈ తుపాన్ దాటికి.. భారీ వర్షాలు, ఈదురుగాలులు సంభవించాయి. ఈ నేపథ్యంలో ఆదివారం పశ్చిమ బెంగాల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
బంగాళాఖాతంలో ఉద్భవించిన రెమాల్ తుపాను(Remal Cyclone) ఆదివారం రాత్రి బెంగాల్ తీరాన్ని తాకింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. బలమైన గాలులు వీచిన కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూడా నేలకొరిగాయి. తుపాను కారణంగా కోల్‌కతా, నార్త్ 24 పరగణాలతో సహా పశ్చిమ బెంగాల్‌లోని ఇతర నగరాల్లో భారీ వర్షం కురిసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర తుపాన్‌గా మారినట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రసుత్తం ఉత్తర దిశగా కదులుతూ.. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ వద్ద రెమల్ తుపాన్ ఈరోజు రాత్రి తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు గరిష్ఠంగా 100నుంచి 135కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెల్లడించారు.
లోక్‌సభ ఎన్నికల(Lok Sabha election 2024) ఆరో దశ(Phase 6) ఓటింగ్ జరుగుతోంది. ఈ దశలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలతో సహా.. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు శనివారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది.
రీమల్ తుఫాను పశ్చిమ బెంగాల్‌ను వణికిస్తోంది. మధ్య బంగాళాఖాతంలో గల తీవ్ర అల్పపీడనం శుక్రవారం తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించే క్రమంలో బలపడి వాయుగుండంగా మారింది.
పశ్చిమబెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి కోల్‌కతా హైకోర్టు షాక్ ఇచ్చింది. 2010 తర్వాత జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ బుధవారంనాడు సంచలన తీర్పు ప్రకటించింది. 1993లో చేసిన చట్టానికి విరుద్ధంగా పత్రాలు జారీ చేశారని న్యాయమూర్తులు తపబ్రత చక్రవర్తి, రాజశేఖర్ మంతాతో కూడిన హైకోర్టు ధర్మాసనం తమ తీర్పులో స్పష్టం చేసింది.
ఓటు బ్యాంకు కోసం జాతీయ భద్రతతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీపడుతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తప్పుపట్టారు. చొరబాటుదారులను రాష్ట్రంలోకి అనుమతించడం ద్వారా ఆమె పాపానికి పాల్పడుతున్నారని అన్నారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయ్ పై భారత ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకుంది. 24 గంటల పాటు ఆయన ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించింది.
తమ సంస్థ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ముర్షిదాబాద్‌లోని భారత్ సేవాశ్రమ్ సంఘ్‌కు చెందిన స్వామి ప్రదీప్తానంద మహరాజ్ పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీకి......
ఇండియా కూటమిలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ వ్యవహారం కాంగ్రెస్‌లో చిచ్చు రేపుతోంది. దీనిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మమత నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అధీర్ చౌదరి వైఖరి పట్ల కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సీరియస్ అయ్యారు...