Share News

Jharkhand: ‘ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర’

ABN , Publish Date - Aug 29 , 2024 | 08:56 AM

హేమంత్ సోరెన్ సారథ్యంలోని ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అందులోభాగంగానే చంపయి సోరెన్ పార్టీ వీడారని పేర్కొంది. అదివాసీల సంక్షేమం కోసం సోరెన్ కుటుంబం కృషి చేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. అలాంటి కుటుంబానికి చెందిన వ్యక్తి హేమంత్ సోరెన్‌ను బీజేపీ జైలుకు పంపిందన్నారు.

Jharkhand: ‘ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర’

న్యూఢిల్లీ, ఆగస్ట్ 28: మరికొన్ని మాసాల్లో జార్ఖండ్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. హేమంత్ సోరెన్ సారథ్యంలోని ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అందులోభాగంగానే చంపయి సోరెన్ పార్టీ వీడారని పేర్కొంది. అదివాసీల సంక్షేమం కోసం సోరెన్ కుటుంబం కృషి చేస్తుందని ఈ సందర్భంగా గుర్తు చేసింది. అలాంటి కుటుంబానికి చెందిన వ్యక్తి హేమంత్ సోరెన్‌ను బీజేపీ జైలుకు పంపిందన్నారు. హేమంత్ సోరెన్ బెయిల్‌పై విడుదలయ్యే క్రమంలో సుప్రీంకోర్టు చేసిన ఘాటైన వ్యాఖ్యలను ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ గుర్తు చేసింది.

Also Read: Haryana: సీఎం వ్యవహారంపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్


ఆ రెండు రాష్ట్రాలు ఎన్నికల తేదీలు ప్రకటించి..

రెండు రాష్ట్రాలు జమ్మూ కశ్మీర్, హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించినప్పుడు.. మిగిలిన జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎందుకు ప్రకటించలేదని ఈ సందర్బంగా మోదీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. చంపయి సోరెన్ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని.. అందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నాయకత్వంపై ప్రశంసలు కురిపించారని గుర్తు చేసింది.


బంద్‌కు బీజేపీ పిలుపుపై స్పందన..

మరోవైపు కోల్‌కతాలో ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచార ఘటన నేపథ్యంలో మంగళవారం విద్యార్థుల ఆందోళన చేపట్టారు. ఆ క్రమంలో వారిపై పోలీసులు వ్యవహరించిన తీరు కారణంగా బుధవారం పశ్చిమబెంగాల్‌లో 12 గంటల బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ సందర్బంగా బీజేపీ వ్యవహరించిన తీరుపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది.


బీజేపీతో కలిసి వెళ్తున్నాం..

ఇంకోవైపు జార్ఖండ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నట్లు ది ఆల్ ఇండియా స్టూడెంట్స్ యూనియన్ (ఎఎస్‌జేయూ) అధినేత, మాజీ డిప్యూటీ సీఎం సుదేశ్ మహతో వెల్లడించారు. ఆగస్ట్ 26వ తేదీన న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో మహతో బేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో కలిసి వెళ్తున్నట్లు మహతో ప్రకటించిన విషయం విధితమే.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 29 , 2024 | 08:56 AM