Share News

Mamata Banerjee: రేపిస్టులకు మరణశిక్ష.. 10 రోజుల్లో బిల్లు

ABN , Publish Date - Aug 28 , 2024 | 02:46 PM

పశ్చిమబెంగాల్‌లో ప్రశాంతతను తాను కోరుకుంటున్నామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తృణమూల్ ఛాత్ర పరిషత్ పౌండేషన్ డే సందర్భంగా బుధవారంనాడు కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష పడాల్సిందేనన్నారు.

Mamata Banerjee: రేపిస్టులకు మరణశిక్ష.. 10 రోజుల్లో బిల్లు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ప్రశాంతతను తాము కోరుకుంటున్నామని పశ్చిమబెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. తృణమూల్ ఛాత్ర పరిషత్ పౌండేషన్ డే సందర్భంగా బుధవారంనాడు కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, అత్యాచారాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష పడాల్సిందేనన్నారు. వచ్చే వారంలోనే అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి, రేపిస్టులకు మరణశిక్ష పడేలా 10 రోజుల్లో బిల్లును ఆమోదిస్తామని తెలిపారు. బిల్లును గవర్నర్‌కు పంపిస్తామని, ఆయన ఆమోదించకుంటే రాజ్‌భవన్ ఎదుట బైఠాయింపు చేపడతామని చెప్పారు. "బిల్లు ఆమోదించాల్సిందే. ఈసారి ఆయన (గవర్నర్) జవాబుదారీతనం నుంచి తప్పించుకోలేరు'' అని మమత స్పష్టం చేశారు.


ఆర్జీ కర్ డాక్టర్‌కు అంకితం..

''టీఎంసీ ఈవెంట్‌ను ఆర్‌జీ కర్ డాక్టర్‌కు అంకితం చేస్తున్నాం. మేము న్యాయం కోరుకుంటున్నాం. కానీ బీజేపీ ఈరోజు బంద్‌కు పిలుపునిచ్చింది. వాళ్లు న్యాయం కోరుకోవడం లేదు. వాళ్లు కేవలం బెంగాల్‌ను అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారు. బంద్‌కు మేము మద్దతివ్వం. బీజేపీ ఎన్నడూ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కనీసం మణిపూర్‌ ముఖ్యమంత్రి రాజీనామాకు డిమాండ్ చేయలేదు. 'నబన్నా అభియాన్ ర్యాలీ' ఫోటోలు చూశా. పరిస్థితిని సమర్ధవంతంగా అదుపు చేసిన పోలీసులకు నేను సెల్యూట్ చేస్తున్నాను'' అని సీఎం అన్నారు. ట్రైనీ డాక్టర్‌పై అత్యాచార, హత్యా ఘటనతో ప్రమేయమున్న నిందితుడికి ఉరిశిక్ష పడాల్సిందేనని తాను పదేపదే చెబుతున్నట్టు తెలిపారు.

Bangla bandh: బెంగాల్‌లో బంద్ హింసాత్మకం.. నలుగురు అరెస్ట్


ఇంతకంటే పెద్ద నిరసన ఢిల్లీలో: అభిషేక్

కాగా, విద్యార్థుల నిరసన ర్యాలీపై పోలీసు చర్యకు నిరసనగా బీజేపీ 12 గంటల బంద్‌కు పిలుపునివ్వడంపై టీఎంసీ నేత, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తీవ్ర స్థాయిలో తప్పుపట్టారు. ఢిల్లీలో ఇంతకంటే పెద్ద నిరసన చేపడతామని బీజేపీని హెచ్చరించారు. ఉన్నావో, హథ్రాస్, బద్లాపూర్ ఘటనలు జరిగినప్పుడు ఆ పార్టీ ఏమైందని అడిగారు. మహిళా భద్రత గురించి మాట్లాడే హక్కు వీరికెక్కడిదని నిలదీశారు. బీజేపీ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. బీజేపీ నిరసనలతో రోడ్లపైకి వచ్చిందని, అత్యాచార వ్యతిరేక బిల్లు తీసుకురమ్మని అమిత్‌షా, జేపీ నడ్డాను అడిగే దమ్ము వారికి ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ అలాంటిదేదీ కోరుకోదని, ఎందుకంటే ఎక్కువ మంది రేపిస్టులు, గూండాలు, దుండగులు అక్కడే కనపడతారని విమర్శలు గుప్పించారు.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 28 , 2024 | 02:49 PM