Share News

Kolkata: సీఎం నివాసంపై దాడికి కుట్ర: అయిదుగురు అరెస్ట్

ABN , Publish Date - Aug 29 , 2024 | 12:58 PM

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంపై దాడికి కుట్ర పన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అయిదుగురు వ్యక్తులను కోల్‌కతా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వుయ్ వాంట్ జస్టిస్ పేరుతో వాట్సప్ గ్రూప్ రూపొందించినట్లు వీరిపై ఆరోపణలు వెల్లువెత్తాయి.

Kolkata: సీఎం నివాసంపై దాడికి కుట్ర: అయిదుగురు అరెస్ట్

కోల్‌కతా, ఆగస్ట్ 29: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసంపై దాడికి కుట్ర పన్నారన్న ఆరోపణల నేపథ్యంలో అయిదుగురు వ్యక్తులను కోల్‌కతా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వుయ్ వాంట్ జస్టిస్ పేరుతో వాట్సప్ గ్రూప్ రూపొందించినట్లు వీరిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో వాట్సప్ గ్రూప్‌ను క్రియేట్ చేసిన వ్యక్తి, అడ్మిన్‌తోపాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Also Read: ఆన్‌లైన్ పాస్ పోర్ట్ సేవలు కొద్ది రోజుల పాటు బంద్


ఇక మనం నాబన్నాకు వెళ్లనవసరం లేదు, ఒక పని చేయండి. అందరం కలిసి సీఎం మమతా బెనర్జి నివసించే కాళీఘాట్‌కు వెళ్లి విధ్వంసం చేద్దాం. దాంతో సీఎం మమతా బెనర్జీ స్వయంగా తన పదవికి రాజీనామా చేస్తారంటూ వాట్సప్ గ్రూప్‌ల్లో ఓ గొంతు వైరల్ అయింది.

అలాగే కాళీఘాట్‌ను ఎంత కాలం పోలీసులు భద్రత కల్పిస్తారు. గంటా? రెండు గంటలు? లేదా మూడు గంటలు?. అయినా కాళీఘాట్‌కు ఎంత మంది భద్రత కల్పిస్తారు. 20 లేదా 30 మంది. తాము కాళీఘాట్‌కు వెళ్తున్నాం.. మీరు రండి అంటూ పోలీసులకు సవాల్ విసురుతూ వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని శుభం సేన్ శర్మ‌గా గుర్తించారు. అతడిని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో మొత్తం అయిదుగురిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు.

Also Read: Gujarat Rains: ఇంటి పైకి చేరిన మొసలి


ప్రబిర్ అరెస్ట్..

ఇక పశ్చిమ బెంగ చాత్ర సమాజ్ పేరిట కొత్త సంస్థను ఏర్పాటు చేసిన ప్రబిర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌కతాలో ట్రైయినీ వైద్యురాలి హత్యాచారం కేసులో సీఎం పదవికి మమతా బెనర్జీ రాజీనామా చేయాలంటూ.. నాబన్నా అభిజన్ పేరుతో మంగళవారం పశ్చిమ బెంగ చాత్ర సమాజ్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ ర్యాలీని నిరోధించేందుకు కోల్‌కతా పోలీసులు చర్యలు చేపట్టారు.

Also Read: Jharkhand: ‘ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్ర’


దీంతో పోలీసులు, ర్యాలీలో పాల్గొన్న వారి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో పలువురు గాయపడ్డారు. అందుకు సంబంధించిన 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. బుధవారం 12 గంటల పాటు బంద్‌కు బీజేపీ పిలుపునిచ్చింది. ఈ బంద్ జరుగుతున్న వేళ.. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

Also Read: Haryana: సీఎం వ్యవహారంపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్


ట్రైయినీ విద్యార్థిపై హత్యాచార ఘటనతో..

ఆగస్ట్ 9వ తేదీ తెల్లవారుజామున కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైయినీ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది. ఈ ఘటన చోటు చేసుకున్న నాటి నుంచి నేటి వరకు మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరపై సర్వత్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.

Also Read: External Affairs Ministry :పాస్ట్‌పోర్ట్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం.. ఎన్ని రోజులంటే..


దీంతో ఈ కేసు దర్యాప్తులో కోల్‌కతా హైకోర్టు జోక్యం చేసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పోలీసులను ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయి, వైద్య కళాశాల ప్రిన్సిపల్ సందీప్ ఘోష్‌‌తోపాటు మరో నలుగురికి పాలీగ్రాఫ్ పరీక్షను నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. దీంతో వారికి ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Aug 29 , 2024 | 01:04 PM