Home » West Indies Cricketers
టీంఇండియా(Team India) వెస్టిండీస్(West Indies) మధ్య రెండో టీ20(Second T20) ఉత్కంఠంగా సాగింది. ఈ మ్యాచ్‌లోనూ భారత్ మరోసారి ఓటమి పాలయింది. విండీస్‌నే మరోసారి విజయం వరించింది.
స్టార్లతో కూడిన భారత బ్యాటింగ్ లైనప్(Indian batting line-up) ముందు 150 పరుగుల ఛేదన పెద్ద కష్టమా.. అనిపించినా, విండీస్ పేసర్లు(West Indies Pacers) బెంబేలెత్తించారు. అరంగేట్ర బ్యాటర్ తిలక్ వర్మ(Tilak Verma) (22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39) రాణించగా.. మిగతా బ్యాటర్ల వైఫల్యం దెబ్బతీసింది.
ఉత్కఠంగా సాగిన T20లో ఇండియా(India) ఓడిపోయింది. వెస్టిండీస్(West Indies) సునాయాసంగా గెలిచి టీమిండియా(Team India) గెలుపును దెబ్బకొట్టింది.
రెండో వన్డే(Second ODI)లో ఎదురుదెబ్బ తగిలినా.. ప్రయోగాలకు మాత్రం టీమిండియా(Team India) వెనకడుగు వేసేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే సిరీస్ నిర్ణాయక ఆఖరి, మూడో వన్డేలోనూ మిడిలార్డర్లో శాంసన్(Samson), సూర్యకుమార్(Suryakumar)ను ఆడించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
వెస్టిండీస్(West Indies)తో రెండో వన్డేలోనూ భారత(India) బ్యాటింగ్ ఆర్డర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. స్లో పిచ్‌పై పరుగులు సాధించడంలో బ్యాటర్ల వైఫల్యం స్పష్టంగా కనిపించింది.
‘మా ఆటగాళ్లకు తగిన మ్యాచ్ ప్రాక్టీస్ లభించాలనేదే మా ఉద్దేశం. ఇందుకోసం వీలైనప్పుడల్లా అవకాశాలిస్తుంటాం’.. తొలి వన్డే ముగిశాక కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలివి.
టెస్టు సిరీస్(Test series) మాదిరిగానే వన్డేల్లోనూ(ODI) టీమిండియా(Team India ) శుభారంభం చేసింది. అటు ఫార్మాట్ మారినా విండీస్(Windies) ఆటతీరు మాత్రం ఎప్పటిలాగే సాగింది.
తొలి టెస్టుల్లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా యషస్వీ జైశ్వాల్, ఇషాన్ కిషన్ అరంగేట్రం చేస్తున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు.
మొదటి టెస్ట్ మ్యాచ్‌కు తుది జట్టును ఎంపిక చేయడం టీమిండియా మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఓపెనింగ్‌లో రోహిత్‌కు జతగా ఎవరిని ఆడించాలి? వికెట్ కీపింగ్ బాధ్యతలను ఎవరి అప్పగించాలి? స్పిన్ డిపార్ట్మెంట్లో ఎవరినీ బెంచ్‌కు పరిమితం చేయాలనే అంశంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ తర్జన భర్జన పడుతున్నారని సమాచారం.
వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు (India tour of West Indies 2023) 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ నెల నుంచి 12 నుంచి 16 మధ్య జరగనున్న మొదటి టెస్ట్ మ్యాచ్ డొమినికా వేదికగా జరగనుంది. ఇక 20 నుంచి 24 మధ్య ట్రినిడాడ్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్నాయి.