Home » Womens Reservation Bill
మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో బుధవారంనాడు చర్చ సందర్భంగా ఆసక్తికర ఘట్టం చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ నిషికాంత్ డూబే మాట్లాడుతుండగా ఆయన ప్రసంగానికి కాంగ్రెస్ విపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి అంతరాయం కలిగించారు. దీంతో హోం మంత్రి అమిత్‌షా జోక్యం చేసుకుని ''మహిళల తరఫున పురుషులు మాట్లాడకూడదా?'' అని ప్రశ్నించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు పై ఓవైపు లోక్‌సభలో చర్చ జరుగుతుండగా, బిల్లు అమలులో విషయంలో జరిగే జాప్యంపై బహుజన్ సమాజ్ పార్టీ అ అధినేత్రి మాయావతి అనుమానాలు వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహిళలను ఆకట్టుకునేందుకే కేంద్రం ఈ బిల్లు తెచ్చినట్టు ఆమె ఆరోపించారు.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టడంపై అటు లోక్‌సభలో చర్చ జరుగుతుండగా, నియోజకవర్గాల పునర్విభజనను దక్షిణ భారత రాష్ట్రాలపై వేలాడుతున్న కత్తిగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేయదని, కేవలం ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకే బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకువచ్చిందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో నితీష్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై బుధవారం లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఈ చర్చను ప్రారంభించారు. ఈ క్రమంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నట్లు ఆమె తెలిపారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు క్రెడిట్ పూర్తిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీదేనని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆలోచన తమదేనని కాంగ్రెస్ చెప్పుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదన్నారు.
మహిళా రిజర్వేషన్లపై నరేంద్ర మోదీ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ వారి హయాంలో వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ తెగల మహిళలకు కీలకమైన అవకాశాలేమీ దక్కలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును తొలిసారి ప్రవేశపెట్టినది కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వమే అయినా ఎప్పుడూ ఎన్డీయే ప్రభుత్వం తమకు క్రెడిట్ ఇవ్వలేదని ఆక్షేపించారు.
పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ల బిల్లు(Womans Reservations Bill) ప్రవేశపెట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ బాలీవుడ్ బ్యూటీలు కంగనా రనౌత్(Kangana Ranaut), ఈషా గుప్తా(Esha Gupta)లు తమ మద్దతు ప్రకటించారు. పార్లమెంట్ ఆహ్వానితుల జాబితాలో వారి పేర్లు ఉండటంతో ఇరువురు నటులు ఇవాళ పార్లమెంటుకు వచ్చారు.
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు(Women's Reservation Bill)కి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని బీఆర్ఎస్ పార్లమెంటరి పార్టీ నేత కేశవరావు(Keshava Rao) వ్యాఖ్యానించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి(MP Mithun Reddy) వ్యాఖ్యానించారు.