Keshava Rao: మహిళా బిల్లుతో పాటు, బీసీ మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి

ABN , First Publish Date - 2023-09-19T18:04:53+05:30 IST

పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు(Women's Reservation Bill)కి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని బీఆర్ఎస్ పార్లమెంటరి పార్టీ నేత కేశవరావు(Keshava Rao) వ్యాఖ్యానించారు.

Keshava Rao: మహిళా బిల్లుతో పాటు, బీసీ మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలి

ఢిల్లీ: పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు(Women's Reservation Bill)కి బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని బీఆర్ఎస్ పార్లమెంటరి పార్టీ నేత కేశవరావు(Keshava Rao) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు బీఆర్ఎస్(BRS) కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..మహిళా బిల్లుతో పాటు, బీసీ మహిళలకు కూడా ప్రాతినిధ్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకోవాలి.2010లో కూడా ఇదే సమస్య వచ్చింది. కొన్ని పార్టీలు బీసీలకు వ్యతిరేఖంగా ఉన్నాయి. బీసీలను అణగదొక్కెందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ఎక్కడయినా ఏ పార్టీ అయినా, పెత్తనం ఉన్న చోట బీసీలను అణిచి వేస్తున్నారు. బీసీలకు ప్రాధాన్యత కల్పించడంలో బీఆర్ఎస్ కొంత బెటర్. మహిళ బిల్లు కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే కాదు ఎందరో ఉద్యమం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మొత్తం మహిళా బిల్లు కోసం కొట్లాడింది. మహిళా నాయకురాలిగా కవిత ఉద్యమం చేస్తోంది. ఎన్నికల్లో బీసీలకు సీట్ల గురించి అన్ని పార్టీలు ఒకే వైఖరితో ఉన్నాయి.. బీసీలు పోరాడాలని కేశవరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-19T18:04:53+05:30 IST