Home » Yadadri Bhuvanagiri
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం వారాంతపు సెలవు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 40 వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి వచ్చారు.
తెలుగు రాష్ట్రాల మధ్య అత్యంత కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణికుల కష్టాలు కొంతమేర తీరనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం కానుంది.
విడిపోవాల్సి వస్తుందేమోనన్న భయమో.. పెద్దలు ఒప్పుకోరన్న ఆందోళనో తెలియదు కాని.. ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోటగడ్డ గ్రామంలో సోమవారం జరిగింది.
‘‘గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదిక ఇవ్వాలన్న అభిప్రాయంతోనే మీరు మాట్లాడుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే తప్పు జరిగిపోయినట్లు.. ఇక ఆ తప్పు వల్ల జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్లు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి.
మహిమాన్విత స్వయంభు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి చెంత స్థానిక భక్తులు గిరిప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ సంప్రదాయం ఏళ్లుగా కొనసాగుతోంది.
తండ్రి ఆస్తి కోసం కోర్టుకెక్కిన ఇద్దరు చెల్లెళ్లు, సోదరుడి వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని, ఆ కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని భార్య, బంధువులు తేల్చి చెప్పారు. దీంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహం మూడు రోజులుగా మార్చురీలోనే మగ్గుతోంది.
ఛత్తీ్‌సగఢ్ విద్యుత్తు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్కేంద్రాలకు సంబంధించిన అంశాల్లో తాను స్వయంగా నిర్ణయాలు తీసుకోలేదని ట్రాన్స్‌కో, జెన్కో మాజీ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు చెప్పారు. నాటి పరిస్థితులు, ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగానే ముందుకు వెళ్లామని తెలిపారు.
పుణ్య క్షేత్రానికి పిల్లాపాపలతో కలిసి వెళ్లాక స్వామివారి దర్శనం కోసం క్యూలో నిల్చుని టికెట్లు తీసుకోవడం.. బ్రేక్ దర్శనానికో.. శ్రీఘ్రదర్శనానికో.. వత్రాలు, ఇతర పూజా కైంకర్యాలకో రద్దీని తట్టుకొని టికెట్లు సంపాదించడం ఎంత ప్రయాస? బస చేసేందుకు అప్పటికప్పుడు గదులు బుక్ చేసుకోవడమూ కష్టమే! మరి..
మాడు పగిలే ఎండ.. ఉక్కిరిబిక్కిరి చేసిన వాన! రెండూ ఒకేరోజు విరుచుకుపడటంతో ఆ కష్టనష్టాలు అన్నీఇన్నీకావు! ఎండదెబ్బకు ఇబ్బందిపడ్డ జనం పిడుగుపాట్ల శబ్దాలకూ వణికిపోయారు! వడదెబ్బ కొందరి ప్రాణాలు తీస్తే.. సాయంత్రానికి ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన చెట్లను కూకటివేళ్లతో పెకిలించి.. విద్యుత్తుస్తంభాలను పడగొట్టి.. ఇళ్లపై రేకులను గల్లంతు చేసి.. క్షణాల్లో లోతట్టు కాలనీలను జలమయంచేసి భీతావహ పరిస్థితిని సృష్టించింది.
శ్రీలక్ష్మీనరసింహస్వామి కొలువైన యాదగిరిగుట్టపై పాత ఆచారాలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రధానాలయ ఉద్ఘాటనకు ముందు స్థానిక భక్తులకు గర్భాలయ (అంతరాలయ) దర్శనం ఉండేది. 2022 మార్చి 28న ఉద్ఘాటన అనంతరం కొండపైన ఉన్న పాత ఆచారాలు అన్నిటినీ గత ప్రభుత్వం పక్కనపెట్టింది.