Yadagirigutta: యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
ABN , Publish Date - Nov 24 , 2024 | 10:05 AM
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి ప్రముఖులు, భక్త జనం పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. లక్ష్మీనరసింహ స్వామి ధర్మ దర్శనానికి సుమారు 2 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది.
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీలక్ష్మినరసింహ స్వామి (Sri Lakshminarasimhaswamy) వారి ఆలయానికి భక్తుల (Devotees) రద్దీ పెరిగింది. స్వామి వారిని దర్శించుకోడానికి ప్రముఖులు, భక్త జనం పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ధర్మ దర్శనానికి సుమారు 2 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి గంట సమయం పడుతోంది. దీంతో క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి క్షేత్రం ఆదివారం భక్తజనసంద్రమైంది. కార్తీక మాసం, వారాంతపు సెలవుదినం కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో క్షేత్రానికి చేరుకున్నారు. స్వామి వారి నిజాబిషేకం, అర్చన, నిత్య కళ్యాణం, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రత పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వాహనాలతో పార్కింగ్ స్థలం నిండిపోగా క్షేత్రం చుట్టూ ఉన్న రింగ్‌రోడ్డులో కూడా వాహనాలను పార్కింగ్ చేశారు. కార్తీకమాసం పురస్కరించుకొని సత్యదేవుడి వ్రతాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపారాధన స్థలాల్లో భక్తులతో రద్దీ నెలకొంది. కొండపైన గర్భాలయంలో పాంచనారసింహులతోపాటు శివాలయంలో పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కాగా, క్యూకాంప్లెక్స్‌లతోపాటు ప్రధానాలయం, కల్యాణోత్సవం, వ్రత మండపాలు, ఆలయ తిరువీధులు, శివాలయం, ప్రసాద విక్రయశాల, కొండకింద వ్రత మండపం, లక్ష్మీపుష్కరిణి, అన్నదాన సత్రం, కల్యాణ కట్ట తదితర ప్రాంగణాలు భక్తులతో రద్దీగా మారాయి. ఆలయ ఉత్తర దిశలో ఫొటోలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. అదేవిధంగా భక్తులను కొండపైకి తరలించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. సుప్రభాత సేవతో స్వామి అమ్మవార్లను మేల్కొలిపిన అర్చకస్వాములు స్వయంభువులకు నిత్యపూజలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. కొండపైన శివాలయంలో శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామివారికి నిత్య పూజలు, రుద్రహవన పూజలు, శైవాగమరీతిలో నిర్వహించారు.