Thermal Power Plant: 6న యాదాద్రి తొలి యూనిట్ ప్రారంభోత్సవం
ABN , Publish Date - Dec 03 , 2024 | 05:10 AM
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌లో తొలి యూనిట్‌ను(800 మెగావాట్ల సామర్థ్యం) ఈ నెల 6వ తేదీన ప్రారంభించనున్నారు.
నల్లగొండ, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న నాలుగు వేల మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్‌స్టేషన్‌లో తొలి యూనిట్‌ను(800 మెగావాట్ల సామర్థ్యం) ఈ నెల 6వ తేదీన ప్రారంభించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాలపై సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఈ విషయాన్ని ప్రకటించారు.
పవర్‌ప్లాంట్ యూనిట్ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆహ్వానించారు. అయితే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి రాక షెడ్యూల్ ఇంకా ఖరారవ్వాల్సి ఉంది.