Home » Yashasvi Jaiswal
ఏషియన్ గేమ్స్ 2023 క్వార్టర్ ఫైనల్ 1లో నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. 8 ఫోర్లు, 7 సిక్సులతో 49 బంతుల్లోనే 100 పరుగులు బాదేశాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు.
యశస్వి జైస్వాల్(100) సెంచరీతో పెను విధ్వంసం సృష్టించడంతో నేపాల్ ముందు టీమిండియా 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. చివరి ఓవర్లో రింకూ సింగ్(37) బ్యాటు ఘుళిపించడంతో టీమిండియా స్కోర్ 200 దాటింది.
కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. గాయపడిన జేసన్ హోల్డర్ స్థానంలో చేజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగుతుంది.
అరంగేట్రంలోనే భారీ సెంచరీతో దుమ్ములేపిన టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ తన కుటుంబానికి అదిరిపోయే బహుమతిని ఇచ్చాడు. తన కుటుంబం కోసం ఏకంగా 5 బెడ్రూంల ఇంటిని కొన్నాడు. ఇటీవల అతని కుటుంబం డబుల్ బెడ్రూం ఇంటి నుంచి 5 బెడ్రూంల ఇంటికి మారింది.
సోషల్ మీడియాలో జైశ్వాల్ గురించి ఓ మీమ్ చక్కర్లు కొడుతోంది. అతడు క్రికెట్లోకి రాకముందు సినిమాల్లో నటించాడని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీంతో యషస్వీ జైశ్వాల్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం నటించాడని అంటున్నారు. మాస్ మహారాజా రవితేజ నటించిన విక్రమార్కుడు సినిమాలో బాలనటుడిగా జైశ్వాల్ నటించినట్లు ఓ ఫోటోను వైరల్ చేస్తున్నారు.
మొదటి టెస్ట్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ఘనవిజయం సాధించిన టీమిండియా రెండు రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఇన్నింగ్స్ 141 పరుగుల (India won by an innings and 141 runs) భారీ తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. పరుగుల పరంగా ఆసియా వెలుపల టీమిండియాకు ఇదే అతి పెద్ద విజయం.
వెస్టిండీస్‌తో నేటి నుంచి ప్రారంభం కాబోయే మొదటి టెస్ట్ మ్యాచ్‌లో తనతోపాటు ఆడే ఓపెనర్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టత ఇచ్చాడు. 21 ఏళ్ల యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్‌లో తనతోపాటు ఓపెనర్‌గా ఆడతాడని, శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని హిట్‌మ్యాన్ స్పష్టం చేశాడు. 2023-2025 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్లో భాగంగా టీమిండియా ఆడుతున్న మొదటి టెస్ట్ సిరీస్ ఇదే కావడం గమనార్హం.
వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా గ్రౌండ్ ప్రాక్టీస్ షురూ చేసింది. 17 మంది సభ్యుల టీమిండియా రెండుగా విడిపోయి రెండు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. బ్యాటర్లు ఒక టీమ్‌గా, బౌలర్లు మరో టీమ్‌గా తలపడుతున్నారు. అయితే అనూహ్యంగా వార్మప్ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ స్థానంలో యువ క్రికెటర్ యషస్వీ జైశ్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ తరఫున మెరుపు ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన జైశ్వాల్ ఏకంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. త్వరలో వెస్టిండీస్ పర్యటనలో రెండు టెస్టుల కోసం ప్రకటించిన టీమిండియాలో సీనియర్ ఆటగాడు పుజారా స్థానంలో జైశ్వాల్‌కు సెలక్టర్లు అవకాశం కల్పించారు. అయితే ఐపీఎల్ లాంటి మెగా క్రికెట్ లీగ్‌లోనూ స్లెడ్జింగ్ జరుగుతోందని జైశ్వాల్ అన్నాడు.