Home » Yogi Adityanath
గతంలో జరిగిన అనేక దాడులు సనాతన ధర్మానికి నష్టం కలిగించలేకపోయాయన్నారు. నేడు కూడా పరాన్నజీవులు అధికార దాహంతో చేసే దాడుల వల్ల ఎటువంటి హాని జరగదని స్పష్టం చేశారు.
భారత దేశంలో వివాహ వ్యవస్థను నాశనం చేయడానికి పద్ధతి ప్రకారం కుట్ర జరుగుతోందని అలహాబాద్ హైకోర్టు మండిపడింది. వివాహ వ్యవస్థ యువతీ, యువకులకు భద్రత, సామాజిక ఆమోదం, స్థిరత్వాలను ఇస్తుందని, వీటిని సహజీవనం ఇవ్వదని చెప్పింది.
భారతీయ జనతా పార్టీ (BJP) అధిష్ఠానంతో ఆ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi)కి సత్సంబంధాలు రాన్రానూ తగ్గుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలపై ఆయన తరచూ ట్వీట్లు చేస్తూ తన అసమ్మతి గళాన్ని వినిపిస్తూ ఉంటారు.
నిత్యం రాజకీయాలతో తలమునకలయ్యే నేతలు ఒక్కోసారి అటవిడుపుగా తమకు నచ్చిన క్రీడల్లోనూ ఓ చేయి వేస్తుంటారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం మంగళవారంనాడు హాకీ బ్యాట్ పట్టారు. అయితే, ఇది ఆటవిడువుగా కాకుండా జాతీయ క్రీడా దినోత్సవాల సందర్భంగా ఆయన హ్యాకీ బ్యాట్‌తో దర్శనమిచ్చారు.
రక్షాబంధన్ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోది ఆదిత్యనాథ్ రాష్ట్రంలోని మహిళందరికీ 'రాఖీ' కానుక ప్రకటించారు. ఆగస్టు 30, 31 తేదీల్లో అన్ని సిటీ బస్సులలోనూ ఉచితంగా మహిళలు ప్రయాణించే వెసులుబాటు కల్పించారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)కి వారసునిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ప్రజాదరణ ఎక్కువగా కనిపిస్తోంది. మోదీ తర్వాత ఎవరిని ప్రధాన మంత్రి పదవిలో చూడాలని కోరుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు 29 శాతం మంది అమిత్ షాకు ఓటు వేశారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) పాదాభివందనం చేయడాన్ని కొందరు నెటిజన్లు తీవ్రంగా ఖండిస్తున్నారు. అయితే రజినీకాంత్ ఫ్యాన్స్ మాత్రం ఆయనను సమర్థిస్తూ, ఆయన ఎంతో అణకువగల వ్యక్తి అని అభినందిస్తున్నారు.
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కి భారత దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని అందజేస్తున్న వ్యక్తిని ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్‌లో అరెస్ట్ చేశారు. భారత దేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడం కోసం యువతను ఈ వ్యక్తి ప్రేరేపిస్తున్నట్లు కూడా వెల్లడైంది.
ఉత్తర ప్రదేశ్ శాసన సభలో శుక్రవారం నవ్వులే నవ్వులు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీ నేత శివపాల్ యాదవ్ మధ్య జరిగిన సంభాషణ సభలో ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించింది. ఓం ప్రకాశ్ రాజ్‌భర్‌కు మంత్రి పదవి ఇవ్వాలని శివపాల్ యాదవ్ కోరడంతో సీఎం చతురతతో స్పందించి, నవ్వులు పూయించారు.
మాఫియా డాన్‌ల తాట తీస్తున్న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కన్ను ఈసారి శాసన సభ సమావేశాల తీరుపై పడింది. శాసన సభలో సభ్యులు పత్రాలను చింపుతూ, గందరగోళం సృష్టిస్తూ పత్రికలు, మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కుతున్న విషయాన్ని గమనించారు. ఇకపై శాసన సభ హుందాగా, ప్రశాంతంగా కనిపించేలా చేయడానికి ఆయన నడుం బిగించారు.