Home » Yogi Adityanath
రాజ్యాంగం(constitution) కంటే షరియత్(Shariat law) పెద్దది కాదని ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(yogi adityanath) వ్యాఖ్యానించారు. ఈ దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని గుర్తు చేశారు. ముస్లింలు దేశంలో(india) ఇళ్లు సహా అనేక పథకాలను పొందుతున్నారని పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సన్నద్ధమవుతున్నారు. రాష్ట్రంలో పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి ఆయన సారథ్యం వహించనున్నారు. హోలీ వేడుకలు ముగిసిన వెంటనే మధుర నుంచి ప్రచారం ప్రారంభించి, పార్టీ శ్రేణులను ఉత్తేజపరచనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వీడియో ఒక్కటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో ఫేక్ అని పోలీసులు తేల్చారు. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్ సాయంతో కొందరు వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఘటనపై ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. గ్రేస్ గార్సియా ఫేస్ బుక్ ప్రొఫైల్‌లో వీడియోను పోస్ట్ చేశారని గుర్తించారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ(narendra Modi) పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు ప్రధాని ఉత్తర్ ప్రదేశ్‌లోని అజంగఢ్ జిల్లాకు చేరి రూ.34,700 కోట్లతో పలు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మంత్రివర్గాన్ని మంగళవారంనాడు విస్తరించారు. కొత్తగా నలుగురిని మంత్రులుగా తీసుకున్నారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్త మంత్రులతో గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ప్రమాణస్వీకారం చేయించారు.
అప్పుడప్పుడు కొందరు వ్యక్తులు విచక్షణ కోల్పోయి నోటికొచ్చింది మాట్లాడేస్తుంటారు. తాము చేస్తోంది తప్పా? ఒప్పో? అనేది పట్టించుకోకుండా హద్దుమీరి ప్రవర్తిస్తుంటారు. ఆ తర్వాత తగిన మూల్యం చెల్లించుకుంటారు. ఇప్పుడు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తిది కూడా ఇదే పరిస్థితి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో (PM Narendra Modi) పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లను (CM Yogi Adityanath) చంపేస్తానని అతడు బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అతడ్ని అరెస్టు చేశారు.
ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ పేపర్ లీకేజీ కేసులో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యూపీ పోలీస్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ బోర్డు చైర్పర్సన్ రేణుకా మిశ్రాను ఆ పదవి నుంచి తొలగించారు.
లోక్‌సభ ఎన్నికల వేళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. ఇందుకు ఈనెల 5వ తేదీ మంగళవారం ముహూర్తం ఖరారైనట్టు బీజేపీ వర్గాల సమాచారం. గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ఆగ్రా పర్యటన నుంచి తిరిగి రాగానే క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని చెబుతున్నారు.
త్వరలో ఉత్తరప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన ఓం ప్రకాశ్, ఎమ్మెల్యే దారా సింగ్‌కు మంత్రి పదవీ వరించే అవకాశం ఉంది.
బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటి సమావేశం ముగిసింది. ఈ సమావేశం ఐదు గంటల పాటు కొనసాగింది. బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. తెలంగాణ సహా మొత్తం 9 రాష్ట్రాల్లో లోక్‌సభ అభ్యర్థులపై కసరత్తు నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 125కు పైగా స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది.