Uttar Pradesh: త్వరలో ఉత్తరప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ.. క్యాబినెట్‌లోకి ఆర్‌ఎల్డీ, ఓం ప్రకాశ్ ..?
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:47 PM
త్వరలో ఉత్తరప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన ఓం ప్రకాశ్, ఎమ్మెల్యే దారా సింగ్‌కు మంత్రి పదవీ వరించే అవకాశం ఉంది.
లక్నో: ఉత్తరప్రదేశ్‌పై (Uttar Pradesh) భారతీయ జనతా పార్టీ (BJP) దృష్టిసారించింది. రాష్ట్రంలో 80 లోక్ సభ స్థానాలు ఉన్న సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లను గెలుచుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా రాష్ట్రీయ లోక్ దళ్, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అభ్యర్థులకు ఉత్తరప్రదేశ్ మంత్రివర్గంలో (Uttar Pradesh Cabinet) చోటు కల్పించనుంది. యూపీలో మంత్రివర్గ విస్తరణ ఉండనుందని గత కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. మార్చి 10వ తేదీన యోగి (Yogi Adityanath) మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: BJP: బీజేపీ సీఈసీ సమావేశంలో 16 రాష్ట్రాల లోక్‌సభ అభ్యర్థులపై చర్చ..!
సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాశ్‌కు మంత్రివర్గంలో చోటు దక్కనుంది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓం ప్రకాశ్ బీజేపీకి మద్దతు ఇచ్చారు. బీజేపీలో చేరిన ఆర్ఎల్డీ ఎమ్మెల్యే దారా సింగ్ చౌహాన్‌కు మంత్రి పదవీ వచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ప్రధాని మోదీకి కొద్దిరోజుల ముందు సీఎం యోగి ఆదిత్యనాథ్ వివరించారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. దాంతో మంత్రివర్గ విస్తరణ ఖరారు అయ్యిందనే వార్తలు వినిపించాయి. తర్వాత విస్తరణపై ఊహాగానాలు జోరందుకున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.