Home » YS Jagan Mohan Reddy
వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆ భూతాన్ని పైకి రాకుండా చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.
బాలీవుడ్ నటి జత్వానీ కేసులో భయంతోనే.. నీలి మీడియా తప్పుడు రాతలు రాస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపణలు చేశారు. నీలి మీడియాలో మహిళలను కించపరుస్తూ తప్పుగా రాయటాన్ని తీవ్రంగా ఖండించారు. జత్వాని కేసుకు దేశవ్యాప్త మద్దతు లభిస్తుందని అన్నారు.
మాజీ సీఎం జగన్ అనాలోచిత నిర్ణయాలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడంలో జగన్ విఫలం అయ్యారని అరోపించారు.
బుడమేరు గండ్లను 58 గంటలు పగలు, రాత్రి తేడా లేకుండా గట్ల మీదే మకాం వేసి పూడ్చామని మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు. మిలటరీ బలగాలు ఆశ్చర్యానికి లోనై ‘శభాష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం’ అని కొనియాడాయని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
Telangana: మాజీ సీఎం జగన్ ఏలేరు వరద ప్రాంతాల్లో పర్యటనకు రావడంపై పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... జగన్‌కు సిగ్గు శరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఏలేరు వరదలకు జగన్ కారణమని ఆరోపించారు.
Andhrapradesh: తాను సీఎంగా ఉన్న నాటి భద్రత కల్పించాలని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్ట్‌లో విచారణ జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. అయితే ప్రభుత్వం వేసిన కౌంటర్‌పై రిప్లై వేసేందుకు తనకు సమయం కావాలని జగన్ తరఫు న్యాయవాది కోరారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు చూసి ప్రజలు బాధపడుతున్నారని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ 11సీట్లు కూడా ఎందుకు ఇచ్చామా అని ప్రజలు బాధపడే పరిస్థితిని ఆయన కల్పిస్తున్నారని ఎద్దేవా చేశారు.
Andhrapradesh: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పాస్‌పోర్టు విషయంలో హైకోర్ట్‌లో కొంతమేరకు మాత్రమే ఊరట లభించింది. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్ట్ విధించిన పాస్‌పోర్టు కాలపరిమితిని ఒక ఏడాది నుంచి ఐదేళ్లకు ఏళ్లకు పెంచుతూ తీర్పు ఇచ్చింది.
కూటమి ప్రభుత్వం మీద బోట్లతో వైసీపీ నేతలు పన్నిన కుట్రను దర్యాప్తు చేస్తున్న పోలీసులు సీరియస్‌గా విచారించాలని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు. ప్రకాశం బ్యారేజ్‌ను ఇసుక పడవలు ఢీ కొట్టడం.. వైసీపీ నేతలు జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, నందిగం సురేష్, తలశీల రఘురాంల కుట్రేనని ఆరోపణలు చేశారు.
ప్రజలపై విద్వేషంతో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన జాతి ద్రోహం ఫలితమే బెజవాడ ముంపునకు కారణమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు.