Share News

AP HighCourt: పాస్‌పోర్ట్ విషయంలో జగన్‌కు కొంత మేర రిలీఫ్

ABN , Publish Date - Sep 11 , 2024 | 12:27 PM

Andhrapradesh: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పాస్‌పోర్టు విషయంలో హైకోర్ట్‌లో కొంతమేరకు మాత్రమే ఊరట లభించింది. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్ట్ విధించిన పాస్‌పోర్టు కాలపరిమితిని ఒక ఏడాది నుంచి ఐదేళ్లకు ఏళ్లకు పెంచుతూ తీర్పు ఇచ్చింది.

AP HighCourt: పాస్‌పోర్ట్ విషయంలో జగన్‌కు కొంత మేర రిలీఫ్
AP High Court

అమరావతి, సెప్టెంబర్ 11: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (Former CM YS Jaganmohan Reddy) పాస్‌పోర్టు విషయంలో హైకోర్ట్‌లో (AP High Court) ఊరట లభించింది. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్ట్ విధించిన పాస్‌పోర్టు కాలపరిమితిని ఒక ఏడాది నుంచి ఐదేళ్లకు పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. కానీ విజయవాడ కోర్ట్ ఆదేశాల ప్రకారం ప్రజాప్రతినిధుల కోర్ట్‌కు వెళ్లి రూ.20 వేల పూచీకత్తు స్వయంగా సమర్పించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. ట్రయల్ కోర్ట్ విధించిన మిగతా షరతులు అన్నీ యథావిథిగా ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది.

CM Revanth: ఎస్సైల పాసింగ్ అవుడ్ పరేడ్‌లో సీఎం కీలక ప్రకటన


సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పరాజయంతో ముఖ్యమంత్రి పదవి కోల్నోయిన వైసీసీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి. సీఎం పదవి పోయిన వెంటనే.. ఆయనకు గతంలో ఇచ్చిన డిప్లమేటిక్‌ పాస్‌పోర్టు రద్దయిపోయింది. అక్రమాస్తుల కేసులో ఆయనకు బెయిల్‌ ఇచ్చేటప్పుడు కోర్టు సాధారణ పాస్‌పోర్టు స్వాధీనానికి ఆదేశించింది. దీంతో.. కుమార్తె పుట్టిన రోజుకు లండన్‌ వెళ్లడానికి ఆయనకు అనుమతిచ్చిన సీబీఐ కోర్టు.. సాధారణ పాస్‌పోర్టును ఐదేళ్ల పాటు రెన్యూవల్‌ చేయాలని ఆదేశించింది. అయితే.. ఐదేళ్ల కాలపరిమితితో కూడిన పాస్‌పోర్టును పొందేందుకు విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టులో నమోదైన కేసు ఆయనకు అడ్డంకిగా మారింది.

AP News: ఏపీ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ


ఆ కోర్టు జగన్‌కు ఏడాది కాలానికి మాత్రమే సాధారణ పాస్‌పోర్టు ఇవ్వాలని ఆదేశించింది. ఈ సందర్భంగా కఠిన షరతులు విధించడంతో ఆయన హైకోర్టును అత్యవసరంగా ఆశ్రయించారు. వాస్తవానికి జగన్‌ తన లండన్‌ పర్యటనపై సొంత పార్టీ ముఖ్యులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. కోర్టు అనుమతి తర్వాతే వారికా విషయం తెలిసింది. ఇప్పుడు ఆకస్మికంగా ఆయన లంచ్‌ మోషన్‌ వేయడంతో పాస్‌పోర్టు సమస్య వెలుగులోకి వచ్చింది. ఈరోజు (బుధవారం) హైకోర్టులో పాస్‌పోర్టు అంశం విచారణకు రాగా.. కాలపరిమితిని పెంచడంతో పాటు.. ట్రయల్ కోర్టు షరతుల ఉంటాయని తేల్చిచెప్పింది.


ఇవి కూడా చదవండి..

AP News: ఏపీ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ

Prakasam Barrage: క్రేన్ ద్వారా బోట్స్ తొలగింపు అసాధ్యం.. నది లోపలికి వెళ్లి మరీ

Read LatestAP NewsAndTelugu news

Updated Date - Sep 11 , 2024 | 01:15 PM