Share News

AP Highcourt: జగన్‌కు భద్రత పిటిషన్‌‌పై విచారణ హైకోర్టులో వాయిదా

ABN , Publish Date - Sep 13 , 2024 | 02:07 PM

Andhrapradesh: తాను సీఎంగా ఉన్న నాటి భద్రత కల్పించాలని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్ట్‌లో విచారణ జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. అయితే ప్రభుత్వం వేసిన కౌంటర్‌పై రిప్లై వేసేందుకు తనకు సమయం కావాలని జగన్ తరఫు న్యాయవాది కోరారు.

AP Highcourt: జగన్‌కు భద్రత పిటిషన్‌‌పై విచారణ హైకోర్టులో వాయిదా
Former CM YS Jagamohan reddy

అమరావతి, సెప్టెంబర్ 13: తాను సీఎంగా ఉన్న నాటి భద్రత కల్పించాలని మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (Former CM YS Jagan mohan Reddy) వేసిన పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్ట్‌లో (AP High Court) విచారణ జరిగింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసింది. అయితే ప్రభుత్వం వేసిన కౌంటర్‌పై రిప్లై వేసేందుకు తనకు సమయం కావాలని జగన్ తరఫు న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణణు హైకోర్టు ఈనెల 25కు వాయిదా వేసింది.

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్.. ఆప్ నేతల్లో వెల్లివిరిసిన ఆనందం


కాగా... ముఖ్యమంత్రి హోదాలో తనకు గతంలో ఉన్న భద్రతను పునరుద్ధరించాలని.. ఈ మేరకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు పర్సనల్‌ సెక్యూరిటీ అధికారులు(పీఎస్‌వోలు), కౌంటర్‌ అసాల్ట్‌ టీములు, జామర్‌ను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర ప్రభుత్వం తనకు కల్పించిన జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీని ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తగ్గించడాన్ని చట్టవిరుద్ధమైన చర్యగా ప్రకటించాలని కోరారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి, రాష్ట్ర హోం శాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీ, నిఘా విభాగం ఐజీ, గుంటూరు ఎస్పీ, రాష్ట్ర స్థాయి సెక్యూరిటీ రివ్యూ కమిటీని తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.


గత విచారణలో జగన్ పిటిషన్‌పై కౌంటర్ వేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ (ఐఎస్‌డబ్ల్యూ), ఎస్పీ, స్టేట్‌ లెవల్‌ సెక్యూరిటీ రివ్యూ కమిటీ సభ్యుడు ఐపీఎస్‌ అధికారి షెల్కే నచికేత్‌ విశ్వనాథ్‌ హైకోర్టులో కౌంటర్‌ దాఖలు చేశారు. ‘‘మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పిస్తున్నాం. ఈ కేటగిరీ కింద మొత్తం 58 మంది భద్రతా సిబ్బంది రక్షణగా ఉంటారు. తాజా భద్రత ముప్పు విశ్లేషణ నివేదిక ఆధారంగా ఆయనకు జడ్‌ ప్లస్‌ కొనసాగించాలని సెక్యూరిటీ రివ్యూ కమిటీ సిఫార్సు చేసింది. పిటిషనర్‌ 2014-19 మధ్య ప్రతిపక్షనేతగా ఉండగా జడ్‌ కేటగిరీ భద్రత ఉండేది. 2019లో ముఖ్యమంత్రి అయ్యాక జడ్‌ ప్లస్‌ ఇచ్చారు.

Purandeswari: వరద అనంతర చర్యలు కూడా వేగంగా జరగడం గొప్ప విషయం


బుల్లెట్‌ ఫ్రూప్‌ వాహనం కేటాయించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన, ఆయన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక సెక్యూరిటీ గ్రూప్‌ను ఏర్పాటు చేస్తూ 2023లో చట్టం తీసుకొచ్చారు. దీని ఆధారంగా జగన్‌కు అదనపు సిబ్బందితో భద్రత కల్పించారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓటమి చెందింది. ఈ నేపథ్యంలో అదనపు భద్రతకు జగన్‌, ఆయన కుటుంబ సభ్యులు అనర్హులు. చట్ట నిబంధనలు అనుసరించి ముఖ్యమంత్రి హోదాలో తనకు అదనపు భద్రత కల్పించారని పిటిషనర్‌కు తెలిసినప్పటికీ, ఆ విషయాన్ని దాచిపెట్టి ప్రస్తుత పిటిషన్‌ వేశారు. ప్రస్తుతం జగన్‌ ఓ ఎమ్మెల్యే మాత్రమే. ఎమ్మెల్యే హోదాలో ఆయనకు 1+1సెక్యూరిటీకి మాత్రమే అర్హులు. ఆయనకు ముప్పు ఉందని భావించినప్పటికీ 2+2 సెక్యూరిటీ మాత్రమే పొందగలరు. అయినప్పటికీ ప్రభుత్వం జగన్‌కు బుల్లెట్‌ ఫ్రూప్‌ వాహనంతో పాటు జెడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత కల్పిస్తుంది అంటూ కౌంటర్‌ దాఖలు చేశారు.


ఇవి కూడా చదవండి...

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్.. ఆప్ నేతల్లో వెల్లివిరిసిన ఆనందం

Prandeshwari: కూటమి ప్రభుత్వ సారధ్యంలో ఏపీ అభివృద్ధి ఖాయం

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 13 , 2024 | 02:11 PM