Peethala Sujatha: జత్వానీ కేసులో భయంతోనే.. నీలి మీడియా తప్పుడు రాతలు: పీతల సుజాత
ABN , Publish Date - Sep 17 , 2024 | 04:31 PM
బాలీవుడ్ నటి జత్వానీ కేసులో భయంతోనే.. నీలి మీడియా తప్పుడు రాతలు రాస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత ఆరోపణలు చేశారు. నీలి మీడియాలో మహిళలను కించపరుస్తూ తప్పుగా రాయటాన్ని తీవ్రంగా ఖండించారు. జత్వాని కేసుకు దేశవ్యాప్త మద్దతు లభిస్తుందని అన్నారు.
అమరావతి: ఏపీ రాజకీయాల్లో బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసు పెను సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో వైసీపీ నేతలపై పలు ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసుపై మాజీ మంత్రి పీతల సుజాత స్పందించారు. వైసీపీ నేతలు, మాజీ సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. విశాఖపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పీతల సుజాత ఈరోజు(మంగళవారం) మీడియా సమావేశం నిర్వహించారు.
ALSO READ: AP Liquor Policy: నూతన మద్యం పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం చెప్పిన మాటలివే...
ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ... బాలీవుడ్ నటి జత్వానీ కేసులో భయంతోనే.. నీలి మీడియా తప్పుడు రాతలు రాస్తోందని ఆరోపణలు చేశారు. నీలి మీడియాలో మహిళలను కించపరుస్తూ తప్పుగా రాయటాన్ని తీవ్రంగా ఖండించారు. జత్వాని కేసుకు దేశవ్యాప్త మద్దతు లభిస్తోందని అన్నారు. నీలి మీడియా మాత్రం దోషులను కాపాడేందుకు తప్పుడు రాతలు రాస్తోందని పీతల సుజాత ఆరోపించారు.
ALSO READ: AP Cabinet: రేపే ఏపీ కేబినెట్ భేటీ.. ఏయే అంశాలపై చర్చిస్తారంటే.
కుట్రపూరితంగా మహిళలందరినీ ఇబ్బందులకు గురిచేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు. ఇది వారి దిగజారుడు రాజకీయానికి నిదర్శనమని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి స్క్రిప్ట్‌తోనే జత్వానిపై కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. జత్వానిని, ఆమె తల్లిదండ్రులను వైసీపీ నేతలు దారుణంగా హింసించారని ఆరోపించారు.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 నుంచి 11 సీట్లకు పడిపోయేసరికి జగన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయిందని పీతల సుజాత ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో లాగా కూటమి ప్రభుత్వంలో చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చర్యలు తప్పకుండా తీసుకుంటామని పీతల సుజాత హెచ్చరించారు.
విజయసాయికి టీడీపీ నేత సవాల్
వైసీపీ నాయకులు గత ఐదేళ్లలో చేసిన కబ్జాల వల్ల బుడమేరు వరద నీరు విజయవాడలోకి వచ్చి విధ్వంసం సృష్టించిందని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నాదెండ్ల బ్రహ్మం అన్నారు. బుడమేరు ఆక్రమణలను ఇప్పటికైనా తొలగించకపోతే భవిష్యత్తులో విజయవాడ పట్టణానికి మరిన్ని విపత్తులు పొంచి ఉన్నాయని హెచ్చరించారు.
వైసీపీ నేత విజయసాయి రెడ్డికి విజయవాడ ప్రజలు ముఖ్యం కాదా అని ప్రశ్నించారు. బుడమేరు పరివాహక ప్రాంతాల్లో వైసీపీ నాయకులు చేసిన ఆక్రమణలు ముఖ్యమో? తేల్చుకోవాలని సవాల్ విసిరారు. బుద్ధి, జ్ఞానం ఉన్న వారెవరు బుడమేరు ఆక్రమణల తొలగింపునకు చంద్రబాబు అద్దె ఇంటికి లంకె పెట్టరని నాదెండ్ల బ్రహ్మం అన్నారు.
చంద్రబాబు అద్దెకు ఉన్న ఇల్లు ఆయన సొంతం కాదని ముందుగా పులివెందుల ఎమ్మెల్యే అతని బ్యాచ్ తెలుసుకోవాలని అన్నారు. బుడమేరు ఆక్రమణలు తొలగించవద్దని.. దమ్ముంటే సాయిరెడ్డి విజయవాడ నడిబొడ్డున నిలబడి చెప్పాలని నాదెండ్ల బ్రహ్మం సవాల్ విసిరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Pawan: అభివృద్ధిలో తెలంగాణ ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ..
AP Cabinet: రేపే ఏపీ కేబినెట్ భేటీ.. ఏయే అంశాలపై చర్చిస్తారంటే.
Read LatestAP NewsAndTelugu News