Share News

CM Chandrababu: బుడమేరు పూర్తిగా దురాక్రమణకు గురైంది

ABN , Publish Date - Sep 17 , 2024 | 08:05 PM

వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఆ భూతాన్ని పైకి రాకుండా చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.

CM Chandrababu: బుడమేరు పూర్తిగా దురాక్రమణకు గురైంది
CM CHANDRABABU

విజయవాడ: బుడమేరు, కృష్ణా కట్టదాటుకోని భవానీపురానికి రావడం చరిత్రలో ఎన్నడూ చూడలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. బుడమేరు పూర్తిగా దురాక్రమణ, కబ్జాలకు గురైందని ఆరోపణలు చేశారు. ఈరోజు (మంగళవారం) ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ... ఈ నెల 20వ తేదీతో వరదలు వచ్చి 10రోజులు అవుతుందని తెలిపారు. ప్రతిరోజు ఏదో ఒక ఇబ్బంది ఉందని అన్నారు. దీనికితోడు వైసీపీ రంగులున్న బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీ కొట్టాయని అన్నారు. దీంతో బ్యారేజీ గేట్లు రిపేరు చేయించామని అన్నారు.


ALSO READ:Peethala Sujatha: జత్వానీ కేసులో భయంతోనే.. నీలి మీడియా తప్పుడు రాతలు: పీతల సుజాత

బోట్లు అధిక బరువు ఉండటంతో వాటిని బయటకు తీయడం కష్టంగా మారిందని చెప్పారు. ఈ విపత్కర పరిస్థితిలో సహాయక చర్యలపై ఎన్నడూ నిర్లక్ష్యం చేయలేదని స్పష్టం చేశారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, నారాయణ, వంగలపూడి అనిత అదరూ అక్కడే ఉండి సహయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించారని తెలిపారు. ఇన్ని ప్రయత్నాలు చేశాక కూడా మామూలు స్ధితికి రావడానికి 10రోజులు పట్టిందని వివరించారు.


ALSO READ:AP Liquor Policy: నూతన మద్యం పాలసీపై మంత్రివర్గ ఉపసంఘం చెప్పిన మాటలివే...

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారని వైసీపీ ఆరోపణలు చేసిందని అన్నారు. అమరావతికి డబ్బులు వద్దని చెప్పారని అన్నారు. సైట్ ఇవ్వకపోవడం వల్ల జోన్ లేకుండా పోయిందని... 100 రోజుల్లో తాము ఇచ్చామని తెలిపారు. రూ. 990 కోట్లు పంచాయతీ డబ్బులు డైవర్ట్ చేస్తే అవి ఇచ్చి రూ. 1600 కోట్లు తెచ్చామని గుర్తుచేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్‌లో కేవలం రూ. 2వేల కోట్లు మాత్రమే నష్టం చూపిస్తోందన్నారు. డబ్బులు ఏం చేశారో కూడా లెక్కలు లేకుండా చేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్ని చేశారని ఆరోపించారు. అందుకే ఈ భూతాన్ని పైకి రాకుండా చేయాలని సీఎం చంద్రబాబు విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

AP NEWS: ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపులో పురోగతి

Pawan: అభివృద్ధిలో తెలంగాణ ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ..

AP Cabinet: రేపే ఏపీ కేబినెట్ భేటీ.. ఏయే అంశాలపై చర్చిస్తారంటే.

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 17 , 2024 | 09:15 PM