Home » YS Jagan Mohan Reddy
రైతుల పేరుతో జగన్ ప్రభుత్వం అనుమతులు తెచ్చి గ్రావెల్‌ని లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వేశారని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. అప్పటి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కనుసన్నల్లో మొత్తం అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ప్రధాన దోపిడీదారుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి మైనింగ్ అధికారులు ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు..
మరుగునపడిన వ్యవస్థలను త్వరలోనే గాడిలో పెడతామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 18వేల కోట్ల రూపాయల బకాయిలు ఒక్క జలవనరుల శాఖలోనే పెట్టిందని ఆరోపించారు.
ఏపీలో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా లకు చెందిన జడ్పీటీసీలు, నాయకులతో మాజీ సిఎం జగన్ సమావేశం అయ్యారు.
భక్తుల మనోభావాలు గౌరవించి జగన్‌ను డిక్లరేషన్ ఇవ్వమంటే దేశం, హిందూయిజం మీద దాడి చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. తన మతం మానవత్వం అని చెప్పుకుంటున్న జగన్‌ది కృరత్వమని విమర్శించారు. జగన్‌ది మానవత్వం కాదు.. కృరత్వమని ఎద్దేవా చేశారు. కల్తీ లడ్డు వ్యవహారంలో జరిగిన తప్పు ఒప్పుకోలేక, క్షమాపణ చెప్పలేక జగన్ వంకర మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
తిరుమల లడ్డూ విషయంపై సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. లిక్కర్ షాపులు రద్దు చేస్తూ...ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తిరుపతిలో అత్యధికంగా మద్యం షాపులు కేటాయించడాన్ని ఏమనుకోవాలి? అని గుడివాడ అమర్నాథ్ నిలదీశారు.
రాష్ట్ర విభజన కంటే జగన్ పాలన వల్ల ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. 2014-19 ఐదేళ్ల వైసీపీ పాలనలో పేదల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ ఏ తప్పు చేయలేదు కాబట్టి సీబీఐ విచారణ కోసం డిమాండ్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు. సీబీఐ విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని అన్నారు.
Andhrapradesh: తిరుమల వెళతానన్న జగన్.. నిన్న సాయంత్రం తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బుద్దా వెంకన్న అన్నారు. ‘‘మనం అనుకుంటే కాదు... ఆ స్వామి అనుగ్రహిస్తేనే మనం వెళ్లగలం.. వెంకన్న స్వామి అనుమతి లేదు కాబట్టే జగన్ వెళ్లలేకపోయారు’’ అని అన్నారు.
తిరుమల లడ్డూ (Tirumal Laddu) వివాదంపై సుప్రీంకోర్టులో పిల్స్ దాఖలయ్యాయి. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Former Chairman YV Subbareddy), సుబ్రహణ్యస్వామి వేర్వేరుగా పిల్స్ దాఖలు చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై విచారణ చేయాలని సుబ్రహ్మణ్యస్వామి విజ్ఞప్తి చేశారు.
జగన్ తిరుమలకు వెళ్లవద్దని ఎవరైనా నోటీసులు ఇచ్చారా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. తిరుపతిలో పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉందని తెలిపారుబ. తిరుమలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు.