Share News

Buddha Venkanna: నిన్ను ఆపింది ఆ శ్రీవారే.. జగన్‌పై బుద్దా వెంకన్న ఫైర్

ABN , Publish Date - Sep 28 , 2024 | 11:33 AM

Andhrapradesh: తిరుమల వెళతానన్న జగన్.. నిన్న సాయంత్రం తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని బుద్దా వెంకన్న అన్నారు. ‘‘మనం అనుకుంటే కాదు... ఆ స్వామి అనుగ్రహిస్తేనే మనం వెళ్లగలం.. వెంకన్న స్వామి అనుమతి లేదు‌ కాబట్టే జగన్ వెళ్లలేక‌పోయారు’’ అని అన్నారు.

Buddha Venkanna: నిన్ను ఆపింది ఆ శ్రీవారే.. జగన్‌పై బుద్దా వెంకన్న ఫైర్
TDP Leader Buddha Venkanna

విజయవాడ, సెప్టెంబర్ 28: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై (Former CM YS Jaganmohan Reddy) టీడీపీ నేత బుద్దా వెంకన్న (TDP Leader Buddhavenkanna) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల (Tirumala) అంశంలో జగన్ తీరుపై ఫైర్ అయ్యారు. తిరుమలను స్వార్థ రాజకీయాల కోసం జగన్ వాడటం నీచమని మండిపడ్డారు. తిరుమల వెళతానన్న జగన్.. నిన్న సాయంత్రం తనకు అనుమతి ఇవ్వలేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘‘మనం అనుకుంటే కాదు... ఆ స్వామి అనుగ్రహిస్తేనే మనం వెళ్లగలం.. వెంకన్న స్వామి అనుమతి లేదు‌ కాబట్టే జగన్ వెళ్లలేక‌పోయారు’’ అని అన్నారు.

Janimaster: నా భర్తను ట్రాప్ చేసింది.. నరకం అంటే ఏంటో చూశా.. జానీ మాస్టర్ భార్య


నీ వాళ్లే నీ మాట వినలేదు...

బైబిల్ ఇంట్లో చదువుకునే జగన్‌కు వెంకన్న మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. నిబంధనల‌ మేరకు డిక్లరేషన్ అడిగితే రాద్ధాంతం ఎందుకు అని నిలదీశారు. ‘‘నీ ఇంట్లో నీ భార్యని కూడా తిరుమల తీసుకురాలేవు. సీఎం హోదాలోనే నీ ఇంట్లో వాళ్లు నీ మాట వినలేదు. ఇప్పుడు టీడీపీపై బురదజల్లాలని చూస్తున్నారు. గతంలో తిరుమల ఆలయ పరిసరాల్లో జగన్ చెప్పులు వేసుకుని తిరిగాడు. ఇప్పుడు నెయ్యి కల్తీ‌ వివాదంలో మీ పాత్ర ఉంది. అందుకే వైవి సుబ్బారెడ్డిని వెనుకేసుకు వస్తున్నావు. తిరుమల సాక్షిగా తప్పు‌చేయలేదని చెప్పే ధైర్యం ఉందా’’ అని టీడీపీ నేత ప్రశ్నల వర్షం కురిపించారు.


బాబుపై విమర్శలా..

ఆ స్వామి ఆశీస్సులు చంద్రబాబు‌కు ఉన్నాయన్నారు. మావోయిస్టుల దాడి నుంచి చంద్రబాబును ఆనాడు వెంకన్న స్వామి కాపాడారని తెలిపారు. వైసీపీ హయాంలో తిరుమలలో అపవిత్రం జరిగిందని.. అదే అడిగితే‌ చంద్రబాబుపై విమర్శలు చేస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నువ్వు తిరుమల రావడం ఆ స్వామికే ఇష్టం లేదు. అందుకే ఆయన నిన్ను రానివ్వకుండా నీకు నువ్వే ఆగేలా చేశాడు’’ అని వ్యాఖ్యలు చేశారు.

Nirmala Sitharaman: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదుకు ఆదేశం


ఆ విషయం కూడా తెలీదా...

జగన్ జమానాలో అన్ని అవినీతి, అక్రమాలే అని విమర్శించారు. ప్రభుత్వం వీటిపై విచారణ చేయడంతో జగన్‌లో భయం పట్టుకుందన్నారు. అందుకే ఇప్పుడు ప్రతి అంశాన్ని కుల, మతాల వారీగా వివాదం చేస్తున్నారన్నారు. జగన్ ఇప్పుడు అయినా బుద్ధి తెచ్చుకో.. తీరు మార్చుకో అని హితవుపలికారు. కలుగులో దాక్కున్న వంశీ, కొడాలి‌నానిలు ఇప్పుడు బయటకి వచ్చారన్నారు. మొక్కుబడులు ఉంటే తల నీలాలు ఇస్తారని.. ఈ‌ విషయం‌ కూడా తెలియకుండా చంద్రబాబు గుండు కొట్టించుకుంటారా అని‌ జగన్ అడిగారన్నారు. ‘‘ఆయన ప్రతి యేడాది కోటి రూపాయలు విరాళం ఇస్తారు. నువ్వు ఒక్క రూపాయి అయినా‌ విరాళం ఇచ్చావా. నిన్ను స్వామి‌వారే ఆపారు... నువ్వు రావడం ఆయనకి ఇష్టం లేదు’’ అని అన్నారు. ‘‘మొదటి జాబితాలో నీ పేరు లేదని కొంతమంది వాగుతున్నారు. లిస్ట్‌లతో నాకు పని లేదు...‌నా గుండెల్లో చంద్రబాబు ఉంటారు. నాకు పదవులు ఇస్తే ఇంకా పని చేస్తా... నేనైతే పార్టీ కోసం, చంద్రబాబు, లోకేష్‌‌కు భక్తుడిగా ఉంటా’’ అని బుద్దావెంకన్న స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

Hyderabad: ఎన్టీఆర్‌ మార్గ్ ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జికి కరెంటు షాక్‌..

TelanganaBhavan: తమ గోడు వెళ్లబోసుకునేందుకు తెలంగాణ భవన్‌కు హైడ్రా బాధితులు

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 28 , 2024 | 12:24 PM