Share News

Minister Nimmala Ramanaidu: మరుగునపడిన వ్యవస్థలను త్వరలోనే గాడిలో పెడతాం

ABN , Publish Date - Oct 03 , 2024 | 03:54 PM

మరుగునపడిన వ్యవస్థలను త్వరలోనే గాడిలో పెడతామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 18వేల కోట్ల రూపాయల బకాయిలు ఒక్క జలవనరుల శాఖలోనే పెట్టిందని ఆరోపించారు.

Minister Nimmala Ramanaidu: మరుగునపడిన వ్యవస్థలను త్వరలోనే గాడిలో పెడతాం
Minister Nimmala Ramanaidu

అమరావతి: మరుగునపడిన వ్యవస్థలను త్వరలోనే గాడిలో పెడతామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం 18వేల కోట్ల రూపాయల బకాయిలు ఒక్క జలవనరుల శాఖలోనే పెట్టిందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని ఆరోపణలు చేశారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి జరిగిన నష్టం కంటే 2019-24మధ్య వైసీపీ ప్రభుత్వంలో ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని అన్నారు. కొంతమంది అధికారులు కూడా ఇంకా పాత విధానంలోనే ఉన్నారని.. అన్నింటిని సరిదిద్దుతామని స్పష్టం చేశారు. ఉన్నతాధికారులూ, వ్యవస్థలోనూ ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. వైసీపీకు ఊడిగం చేసే క్రమంలో కొందరు ఉన్నతాధికారులు పనివిధానం మర్చిపోయారని అనిపిస్తోందని మంత్రి నిమ్మల రామనాయుడు విమర్శలు చేశారు.


ఏపీలో సీడ్ పథకం అమలు చేస్తున్నాం: మంత్రి సవిత

విజయవాడ : కేంద్రప్రభుత్వం సహకారంతో ఏపీలో సీడ్ పథకం అమలు చేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖామంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడలో బీసీ సంక్షేమ శాఖలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలుపై నిర్వహించిన వర్క్ షాప్‌లో మంత్రి ఎస్ సవిత పాల్గొన్నారు. ఏపీలో ఇప్పటికే 6 జిల్లాలో సీడ్ పథకం అమలు... త్వరలో మిగిలిన 20 జిల్లాల్లో అమలు చేస్తున్నామని వివరించారు. సీడ్ పథకం కింద బీసీ- ఏలో ఉన్న సంచార జాతుల జీవన ప్రమాణాలు పెంచేలా నిర్ణయం తీసుకుంటున్నామని మంత్రి ఎస్ సవిత అన్నారు.


100 బీసీ హాస్టళ్లలో ఎస్ఆర్ శంకరన్ రిసోర్స్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. బీసీ హాస్టళ్లను తరుచూ సందర్శించాలని జిల్లా అధికారులను మంత్రి సవిత ఆదేశించారు. బీసీ హాస్టళ్లు , గురుకుల పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. బీసీ కులాల వృత్తుల్లో నైపుణ్యం పెంచి జీవనోపాధి పెంపొందించేలా ఆర్థిక చేయూత అందిస్తామని మంత్రి సవిత తెలిపారు. బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా అన్ని కాంపిటీటివ్ పరీక్షలకు శిక్షణ ఇస్తామని మంత్రి చెప్పారు. ఈ వర్క్ షాప్‌లో బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, డైరెక్టర్ మల్లికార్జున, ఎన్ఎం ఎంఎస్ఎంఈ డైరెక్టర్ జనరల్ స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 03 , 2024 | 03:58 PM