Home » YS Sharmila
వీళ్లు ఊసరవెల్లులు. అవసరం తీరాక పుట్టుకనే అవమానిస్తారు. నా భర్త అనిల్‌పై అవినాశ్‌రెడ్డి ఆరోపణలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్, కడప పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలపై(YS Sharmila) కేసు నమోదు చేశారు పోలీసులు. బద్వేల్ పోలీస్ స్టేషన్లో(Badvel Police Station) ఆమెపై కేసు నమోదైంది. మే 2వ తేదీన బద్వేల్ బహిరంగ సభలో వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసు గురించి..
తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. తాను జగన్‌ను పని కావాలని అడిగానని ఆరోపణలు చేస్తున్నారని, నిజానికి తాను ఏ పని కావాలని అడగలేదని స్పష్టం చేశారు.
సీఎం జగన్ (CM Jagan) పులిలా గర్జించాడని.. మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్నారని.. కానీ కేంద్ర ప్రభుత్వం వద్ద చివరికి పిల్లిలా మారారని కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల (YS Sharmila) సెటైర్లు గుప్పించారు. పదేళ్లలో పది పరిశ్రమలైనా ఏపీకి వచ్చాయా? అని ప్రశ్నించారు. ఏపీకి పదేళ్ల కిందట ప్రత్యేక హోదా రావాలని.. కానీ ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, జగన్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రతిపక్ష నేతగా ప్రజల మధ్య పాదయాత్ర చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని ఆయన అధిష్టించారు. ఆ తర్వాత వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రజల మధ్యకు వచ్చిందీ లేదు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై(YS Jagan) ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్ మానసిక పరిస్థితి చూస్తుంటే తనకు భయంగా ఉందని అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన షర్మిల.. జగన్ తనపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ‘జగన్ మానసిక పరిస్థితి గురించి నాకు భయంగా ఉంది. అద్దం(Mirror) పంపిస్తున్నా..
ఏపీ సీఎం జగన్ కన్ఫ్యూజన్లో ఉన్నారా.. ఓటమి భయం ఆయనను వెంటాడుతుందా.. ఐదేళ్ళలో రాష్ట్రానికి ఏం చేశామో చెప్పుకునే పరిస్థితుల్లో లేరా.. ఏ ప్రశ్న వేసినా సూటిగా ఎందుకు సమాధనాం చెప్పలేకపోతున్నారు.. సరైన సమాధానం చెప్పడానికి ఎందుకు సంకోషిస్తున్నారు.. ప్రశ్నలు అడిగితే టెన్షన్ ఎందుకు పడుతున్నారు.. ఇప్పడు ఏపీ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే..
Andhrapradesh: మద్యం నిషేధంపై ముఖ్యమంత్రి ఇచ్చిన హామీపై కడప ఎంపీ అభ్యర్థి, ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ప్రశ్నలు సంధించారు. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని, మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం హామీలు నెరవెరుస్తామని.. పూర్తి మద్య నిషేధం తర్వాతే 2024 ఎలక్షన్లో ఓట్లు అడుగుతానంటూ 2019 ఎన్నికల సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వైఎస్ షర్మిల మరోసారి ప్రశ్నలు సంధించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రచార పర్వంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల క్షణం తీరిక లేకుండా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలు, ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మద్య నిషేదం గురించి నవ సందేహాల పేరుతో మరో లేఖ రాశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఎందుకు అమలు కాలేదని.. వివిధ బ్రాండ్ల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Andhrapradesh: రాష్ట్రంలో పింఛన్ల పేరుతో వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటమాటమాడుతోందని ఏపీపీసీ ఛీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వృద్ధులను ఒక్కో నెల ఒక్కోరకంగా వీధుల్లోకీడ్చి పొట్టన పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. వృద్ధుల ఉసురు కొట్టుకోవద్దని సీఎస్‌కు సూచిస్తున్నానన్నారు.