AP Elections: చెల్లెళ్లు వెనుక చంద్రబాబు ఉన్నాడా? అంటే.. జగన్ ఇచ్చిన జవాబు
ABN , Publish Date - May 04 , 2024 | 07:01 PM
ప్రతిపక్ష నేతగా ప్రజల మధ్య పాదయాత్ర చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని ఆయన అధిష్టించారు. ఆ తర్వాత వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రజల మధ్యకు వచ్చిందీ లేదు.
ప్రతిపక్ష నేతగా ప్రజల మధ్య పాదయాత్ర చేసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్.. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని ఆయన అధిష్టించారు. ఆ తర్వాత వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రజల మధ్యకు వచ్చిందీ లేదు.
అలాగే ఢిల్లీలోని ప్రధాని, ఇతర కేంద్రమంత్రులతో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ భేటీ అయిన.. ఆ తర్వాత రాష్ట్రానికి రావాల్సిన ‘ఈ అంశాలపై’ వారితో చర్చించానంటూ ఈ అయిదేళ్లలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్.. ఒక్క ప్రెస్‌మీట్ పెట్టిందీ లేదు.
కానీ మళ్లీ ఎన్నికలు సమీపించాయి. ఈ నేపథ్యంలో ఆయన వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆ క్రమంలో వైయస్ జగన్.. ఓ జాతీయ మీడియాకు తాజాగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన పలు ప్రశ్నలకు సీఎం వైయస్ జగన్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.
Pawan Kalyan: ఏపీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ కింగ్ మేకర్ కానున్నారా..?
వారసత్వం కోసం కాదు..
రాష్ట్రంలో వారసత్వం కోసం జరుగుతున్న యుద్దమా? అని ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదన్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించి 15 ఏళ్లు అయిపోయిందని గుర్తు చేశారు. తన ప్రభుత్వ హయాంలో చేసిన పనులతోపాటు తనను నమ్మితే.. ప్రజలు తనకే ఓట్లు వేస్తారని ఈ సందర్బంగా వైయస్ జగన్ స్పష్టం చేశారు.
AP Elections: అక్కడ.. ఇక్కడ .. ఎన్డీయేనే..
అదే తనని నమ్మని పక్షంలో ప్రజలు నిర్ణయం మరోలా ఉంటుందన్నారు. తాను వారసత్వం కోసం కాదు.. రాష్ట్రం కోసం యుద్దం చేస్తున్నానని తెలిపారు. ఆ క్రమంలో జరుగుతున్న యుద్ధమని.. అంతేకానీ వారసత్వం కోసం మాత్రం కాదన్నారు.
కాంగ్రెస్‌కు నోటా కంటే తక్కువ ఓట్లు..
ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఎన్డీయే, జగన్‌రెడ్డి కీలకంగా ఉన్నాయని.. వాటిలో వేటికి ఓట్లు పడతాయని యాంకర్ ప్రశ్నించారు. అందుకు వైయస్ జగన్ సమాధానం ఇస్తూ.. ఎన్నికలు అయిన తర్వాత అంటూ కలిద్దామంటూ సమాధానం దాట వేశారు. కాంగ్రెస్ పార్టీకి నోటా కంటే ఒక్క ఓటు కూడా ఎక్కువ రాదన్నారు. ఇక టీడీపీకి వచ్చే ఓట్లన్నీ బై పోలార్ అని ఆయన వ్యాఖ్యానించారు.
AP Elections: ఏపీలో మోదీ ఎన్నికల ప్రచారం.. ఎక్కడ చూసినా ఇదే చర్చ..!!
సొంత చెల్లెళ్ల వెనుక చంద్రబాబు ఉన్నట్లు ఆదారాలున్నాయా?
సొంత చెల్లెళ్లు వైయస్ షర్మిల, సున్నీత నర్రెడ్డిల అంశంపై యాంకర్ ప్రశ్నలకు వైయస్ జగన్ గట్టిగా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. వాళ్లకి సొంత కారణాలున్నాయన్నారు. వారిద్దరు రాంగ్ సైడ్ ఉన్నారని చెప్పారు. అయితే తన చెలెళ్లకు రాజకీయాల్లోకి వెళ్ల వద్దని చెప్పానని పేర్కొన్నారు. కానీ చంద్రబాబుతో వాళ్లు చేతులు కలిపారని ఆరోపించారు.
ఆయన చెబుతున్న మాటలను వాళ్లు నమ్ముతున్నారంటూ వైయస్ షర్మిల, సునీత నర్రెడ్డిల వ్యవహార శైలిని వైయస్ జగన్ ఈ సందర్బంగా నిశితంగా విమర్శించారు. అయితే చంద్రబాబు నాయుడు మాటలు మీ చెల్లెళ్లు వింటున్నారని ఏమైనా ఆధారాలు ఉన్నాయా?.. కాంగ్రెస్ పార్టీ వెనుక ఉండబట్టే వారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారేమో అంటూ సందేహం వ్యక్తం చేయగా.. ఏం జరిగిందో తనకు తెలుసునని వైయస్ జగన్ స్పష్టం చేశారు.
Teachers Fighting: స్కూల్లో టీచర్, ప్రిన్సిపల్ డిష్యూం.. డిష్యూం
తల్లి విజయమ్మ ఎలా మేనేజ్ చేస్తుంది?
ఒక కుటుంబంలో ఒకే ఒక్కరు లీడింగ్‌లో ఉంటే.. మిగతా కుటుంబ సభ్యులంతా ‘అతడికి’ మద్దతుగా నిలబడతారని తాను విశ్వసిస్తానన్నారు. ఇక ఫ్యామిలీలో ఇరు వైపులా మీ తల్లి ఎలా మేనేజ్ చేస్తున్నారంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు సీఎం వైయస్ జగన్.. జవాబు దాట వేసే ప్రయత్నం అయితే చేశారు.
అలాగే తెలంగాణలో పోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి అంశంపై యాంకర్ ప్రశ్నించారు. ఆ క్రమంలో తనధోరణిలో వైయస్ జగన్ సమాధానం ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
Read National News and Telugu News