Share News

AP Politics: వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. కారణమిదే..

ABN , Publish Date - May 06 , 2024 | 08:56 PM

ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్, కడప పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలపై(YS Sharmila) కేసు నమోదు చేశారు పోలీసులు. బద్వేల్ పోలీస్ స్టేషన్‌లో(Badvel Police Station) ఆమెపై కేసు నమోదైంది. మే 2వ తేదీన బద్వేల్‌ బహిరంగ సభలో వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసు గురించి..

AP Politics: వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. కారణమిదే..
YS Sharmila

కడప, మే 05: ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్, కడప పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వైఎస్ షర్మిలపై(YS Sharmila) కేసు నమోదు చేశారు పోలీసులు. బద్వేల్ పోలీస్ స్టేషన్‌లో(Badvel Police Station) ఆమెపై కేసు నమోదైంది. మే 2వ తేదీన బద్వేల్‌ బహిరంగ సభలో వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసు గురించి ప్రసంగించారని.. షర్మిలపై బద్వేల్ నోడల్ అధికారి, మున్సిపల్ కమిషనర్‌లు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. ఎఫ్ ఐఆర్ 168 , ఐపిసి సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.


కాగా, ఎన్నికల నేపథ్యంలో వైఎస్ వివేకా హత్య కేసు గురించి ప్రస్తావించకూడదని కడప కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ వైఎస్ షర్మిల.. వివేకా హత్య కేసును ప్రస్తావించారని అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు బద్వేల్ పీఎస్‌లో ఆమెపై కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా, షర్మిలపై కేసు నమోదు చేయడంపై కాంగ్రెస్ శ్రేణులు సహా విపక్ష పార్టీల నేతలు ఫైర్ అవుతున్నారు. ఇదంతా వైసీపీ నేతల ప్లాన్ అని మండిపడుతున్నారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - May 06 , 2024 | 08:56 PM