AP Elections: సీఎం జగన్‌కు వైఎస్ షర్మిల మరో లేఖ
ABN , Publish Date - May 04 , 2024 | 10:47 AM
ఆంధ్రప్రదేశ్ ప్రచార పర్వంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల క్షణం తీరిక లేకుండా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలు, ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మద్య నిషేదం గురించి నవ సందేహాల పేరుతో మరో లేఖ రాశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఎందుకు అమలు కాలేదని.. వివిధ బ్రాండ్ల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కడప: ఆంధ్రప్రదేశ్ ప్రచార పర్వంలో పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) క్షణం తీరిక లేకుండా ఉన్నారు. గత ఎన్నికల సమయంలో జగన్ ఇచ్చిన హామీలు, ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. మద్య నిషేదం గురించి నవ సందేహాల పేరుతో మరో లేఖ రాశారు. సంపూర్ణ మద్యపాన నిషేధం ఎందుకు అమలు కాలేదని.. వివిధ బ్రాండ్ల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
1) మద్య నిషేధం హామీ ఎందుకు అమలు చేయలేదు..?
2) మూడు దశల్లో మద్య నిషేధం అని మోసం చేశారు. మద్యపానం నిషేధించిన తర్వాత ఓటు అడుగుతానని అన్నారు? కదా.. అప్పుడే జనాల ముందుకు ఎందుకు వచ్చారు ?
3) మద్యం అమ్మకాల్లో రూ.20 వేల కోట్ల నుంచి 30 వేల కోట్లకు ఆదాయం పెంచుకున్నారు..? అమ్మకాల్లో అభివృద్ధి చెందినట్టు కాదా ?
4) మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని ప్రజల రక్తమాంసాలు మీద వ్యాపారం అన్నారు.. ఇప్పుడు మీరు చేస్తుంది ఏంటి?
5) ఎక్కడ దొరకని బ్రాండ్లను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారు ?
6) చేయూత, ఆసరా, అమ్మ ఒడి పథకాల అమలు బాధ్యతను బెవరేజేస్ కార్పొరేషన్‌కు అప్పగించడాన్ని ఎలా సమర్ధిస్తారు ?
7) బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 11 వేల కోట్లు రుణాలు సేకరించాలని ఎందుకు అనుకున్నారు ?
8) మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఎందుకు ఉంది ?
9) రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు..? ఇందులో మీ వైఫల్యం లేదంటారా..?
Read Latest AP News And Telugu News