Home » YS Sharmila
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దూసుకెళ్తున్నారు. తన సోదరుడు, సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. పెద్దముడియం మండలం సుద్ధపల్లి గ్రామం నుంచి ఈ రోజు ప్రచారం ప్రారంభించారు.
ఓటరు తిరగబడితే ఏమవుతుంది.. ఫలితం తారుమరవుతుంది.. అందుకే ఎన్నికల సమయంలో ఓటర్లే దేవుళ్లు.. ఐదేళ్ల పాటు నాయకుల చుట్టూ ప్రజలు తిరిగితే.. ఎన్నికల ముందు మాత్రం నాయకులే ఓటర్ల ముందుకు వస్తారు. మాకు ఓటు వేయండి.. మీ సమస్యలన్నీ తీర్చేస్తామంటూ హామీలిస్తారు. కొంతమంది ప్రజలు నాయకుల మాటలు నమ్మి ఓటు వేస్తే.. మరికొంతమంది ఓటు ఎవరో ఒకరికి వేయాలి కదా అని ఓటు వేస్తుంటారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే సాధారణంగా చాలామంది ప్రజల్లో నాయకులు, పార్టీలపై కోపం ఉంటుంది. అందుకే ఎన్నికల్లో ఫలితాలు ఊహించిన విధంగా ఉండవు. ఒక్కో నియోజకవర్గంలో ఒక్కోలా ఫలితాలు ఉంటాయి. ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఓటరు వైసీపీ ప్రభుత్వంపై తమ అసంతృప్తిని బయటపెడుతున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో వ్యవసాయం పండుగలా ఉండేదని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. బద్వేల్ నియోజక వర్గం, పోరు మామిళ్ల మండలాల్లో బుధవారం షర్మిల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు. ఈ భారీ బహిరంగ సభల్లో సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను పుట్టింది ఇక్కడేనని.. ఇది నా గడ్డ అని తెలిపారు.ఇక్కడే ఉంట..ప్రజలకు సేవ చేస్తానని మాటిచ్చారు. తనను కడప ఎంపీగా గెలిపిస్తే ..కేంద్రంలో మంత్రిని కూడా అవుతానని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల అధినేతలు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తనను కడప ఎంపీగా గెలిపిస్తే కేంద్రంలో మంత్రిని అవుతానని షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా సాధిస్తానని స్పష్టం చేశారు. బద్వేలు నియోజకవర్గం పోరుమామిళ్ల మండలంలో జరిగిన బహిరంగ సభలో షర్మిల మాట్లాడారు.
Andhrapradesh: ఎన్నికల ప్రచారంలో సొంత అన్న, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీసీసీ చీఫ్ షర్మిల, కడప ఎంపీ అభ్యర్థి వ్యాఖ్యలు ఏ రేంజ్లో ఉన్నాయో అందరికీ తెలిసిందే. జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధిపై పాతాళానికి దిగజారి పోయిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఏపీసీసీ చీఫ్ బహిరంగ లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల బిజీగా ఉన్నారు. తన సోదరుడు, ఏపీ సీఎం జగన్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌కు చెల్లి అనే ప్రేమ ఉంటే, మీ బాధ నిజమే అయితే అవినాష్ రెడ్డి చేత నామినేషన్ విత్ డ్రా చేయించాలని కోరారు.
పీలో ఎక్కడ చూసినా ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా అరాచకాలు ఎక్కువైపోతున్నాయని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపించారు. ఎమ్మెల్యే తెల్లం బాలరాజుపై షర్మిల సంచలన ఆరోపణలు చేశారు.
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సొంత కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తెలిసిన తర్వాత సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో కీలక మార్పులు జరిగాయి. జగన్, షర్మిల కుటుంబాలు వేరైపోయాయి. వైఎస్ వివేకా హత్య వీరిద్దరినీ విడదీయలేదు కానీ జగన్ వైఖరే కారణమని మాత్రం తెలుస్తోంది. ఇప్పుడు షర్మిలకు అండగా వైఎస్ వివేకా కుటుంబంతో పాటు బ్రదర్ అనిల్ కుమార్ కూడా రంగంలోకి దిగారు.
ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పార్టీలన్నీ బీభత్సమైన జోరును కనబరుస్తున్నాయి. పోటాపోటీగా జనాల్లోకి వివిధ కార్యక్రమాలతో వెళుతున్నాయి. పార్టీ అధినేతలు సైతం నిత్యం జనాల్లోనే ఉంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల రాజకీయం హీటెక్కింది. మరి కాసేపట్లో జనసేన పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో భారీ రోడ్ షో, ర్యాలీ నిర్వహించనున్నారు.
వైసీపీ (YSRCP)లో తాను చాలా అవమానాలు ఎదుర్కొన్నానని జనసేన నేత, నటులు పృథ్వీరాజ్ (Prithviraj) అన్నారు.ఈ ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం ఖాయమన్నారు. జగన్‌కి కాదు, కూటమికే రెండు బటన్లు నొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.అసభ్యంగా మాట్లాడే మంత్రులు ఎన్నికలయ్యాక ఇంట్లోనే కూర్చునే పరిస్థితి వస్తుందని చెప్పారు. ఆదివారం నాడు విశాఖపట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వైసీపీ నేతలపై పృథ్వీరాజ్ తీవ్ర విమర్శలు గుప్పించారు.