Home » YS Viveka
తండ్రి వైఎస్ వివేకా హత్యోదంతాన్ని వివరిస్తూ సునీతా రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. గతంలో తాను ఒంటరినని.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు తనకు మద్దతుగా నిలుస్తున్నాయన్నారు. షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వాలని వివేకా అడిగారన్నారు. వివేకా పేరును ఓటరు జాబితా నుంచి అప్పట్లో తీసివేశారన్నారు. మొదటి ఛార్జిషీట్లో సీబీఐ నలుగురి పేర్లు పెట్టిందని సునీత తెలిపారు.
2024 ఎన్నికల వేళ ముఖ్యమంత్రి వైయస్ జగన్... 2019 ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా నాటి ఘటనలనే ఫాలో అవుతున్నారా? అంటే అవుననే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఏఫ్రిల్ 13వ తేదీ రాత్రి విజయవాడలోని సింగ్ నగర్లో వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనపై ఆగంతకులు రెండు రాళ్లు వేశారు.
కడప జిల్లా అంటే వైయస్ ఫ్యామిలీ.. వైయస్ ఫ్యామిలీ అంటే కడప జిల్లా. అలాంటి జిల్లాలో రాజకీయం ప్రస్తుతం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల.. కడప ఎంపీగా బరిలో దిగారు. దీంతో ప్రచారంలో ఆమె బాణంలా దూసుకు పోతున్నారు.
మేనత్త వైఎస్ విమలారెడ్డిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మేనత్తకు వయసు మీద పడిందని.. అందుకే సీఎం జగన్ వైపు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలే ఎండకాలం కదా అందుకే జగన్‌కు అనుకూలంగా మాట్లాడుతూ ఉండొచ్చని స్పష్టం చేశారు.
కడపలో తన ప్రచారంతో వైసీపీలో వణుకు పుడుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) విమర్శించారు. అవినాష్ రెడ్డి హంతకుడు అని ప్రజలు నమ్ముతున్నారన్న షర్మిల కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని మార్చాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.
కడప లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహి స్తున్నారు. దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా షర్మిలతో ప్రచారంలో పాల్గొంటున్నారు. హంతకులకు సీటు ఇవ్వడం వల్లే తాను కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
మాజీ మంత్రి, ఏపీ సీఎం జగన్ చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. శివశంకర్ రెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జులై 22వ తేదీకి వాయిదా వేసింది. శివశంకర్ రెడ్డికి ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఎంతో విలువైనవి. ఐదేళ్ల పాటు ప్రజలు తమ పాలకులను ఎన్నుకునే సమయం. అధికారం ఇస్తే ప్రజలకు ఏం చేస్తాం.. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామనేవి రాజకీయ పార్టీలు చెప్పుకుంటుంటాయి. కాని ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ(YCP)కి మాత్రం ఎన్నికలంటే గుర్తొచ్చేది చావులతో సానుభూతి రాజకీయం అనే ప్రచారం జోరుగా సాగుతోంది.
2019 ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం నాడు నేడు. 2019 ఎన్నికల వేళ ప్రతిపక్షనేతగా ఉన్న వైయస్ జగన్‌కి, 2024 ఎన్నికల వేళ ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్‌కు మధ్య చాలా తేడా ఉందని.. ఈ నేపథ్యంలో నాడు నేడు తరహాలో రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.
ఎన్నికల వేళ సంచలనానికి తెరలేపారు వైఎస్ సునీతా రెడ్డి(YS Sunitha). వైఎస్ వివేకా(YS Viveka) హత్య కేసులో న్యాయం చేయాలంటూ ‘జస్టిస్ ఫర్ వివేకా’ పేరుతో ప్రజెంటేషన్ ఇచ్చారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ఆమె.. వివేకానంద రెడ్డి హత్య ఒక రాజకీయ కుట్రగా అభివర్ణించారు. 2009 వైఎస్ఆర్(YSR) మరణం తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలను..