Home » YS Viveka
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే నేడు ఆయన సీబీఐ కోర్టుకి చేరుకున్నారు. గత నెల 14న కోర్టుకు హాజరు కావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్‌ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని సిబీఐకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 18 కి వాయిదా వేసింది.
ఇవాళ మాజీ మంత్రి, సీఎం వైఎస్ జగన్ బాబాయ్ జయంతి. అయితే జగన్ సహా ఎవరూ కూడా ఆయన జయంతిని పట్టించుకున్న పాపాన పోలేదు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పెద్ద ఎత్తున సెటైర్లు వేశారు.
తెలుగు రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన సీఎం వైఎస్ జగన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (YS Viveka Murder Case) కీలక పరిణామం చోటుచేసుకుంది...
జగన్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి తన సోదరి డా. వైఎస్ సునీతారెడ్డే (Dr YS Sunitha Reddy) దగ్గరుండి చూసుకుంటూ వచ్చారు...
2019 మార్చి 15.. ఆ రోజు వైఎస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) మరణించారన్న సంగతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy)కి చెప్పిందెవరు? ఆ కబురు ఆయనకు ఎలా చేరింది? ఇప్పుడు ఇదో పెద్ద మిస్టరీ!..
వివేకా హత్య కేసులో మాజీ ఐఏఎస్ అజేయ కల్లం బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. తెలంగాణ హైకోర్టులో ఆయన నేడు రిట్ పిటిషన్ వేశారు. వివేకా హత్య కేసుపై సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో అన్నీ అబద్ధాలే ఉన్నాయని అజేయ కల్లం పేర్కొన్నారు. ఏప్రిల్ 29, 2023న సీబీఐ తన నుంచి స్టేట్మెంట్ను రికార్డు చేసిందని తెలిపారు. తాను చెప్పింది ఒకటైతే సీబీఐ దాన్ని మార్చి చార్జిషీటులో మరోలా పేర్కొందని అజేయకల్లం పిటిషన్లో వెల్లడించారు. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని ఆయన కోరారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి కలిశారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. వివేకా హత్య కేసులో ఇటీవల కోర్టులో సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసింది.
ప్రైవేట్ డిటెక్టివ్‌కైనా ఇంగిత జ్ఞానం ఉంటుంది. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కల్పిత కథలే కనిపిస్తున్నాయి. బేసిక్ లాజిక్‌ను సీబీఐ మిస్ చేసింది. జగన్‌ను డీమోరలైజ్ చేయడానికే వివేకాను చంపారు. కీలక విషయాలను సీబీఐ పట్టించుకోవట్లేదు.
వివేకా హత్య కేసులో కీలక సాక్షి, ఫిర్యాదుదారు, ‘అనుమానితుడు’ పీఏ ఎంవీ కృష్ణారెడ్డి నుంచి జమ్మలమడుగులో జగన్ మీడియా విలేకరి వరకు అనేకుల వాంగ్మూలాలు ఇప్పుడు బయటపడ్డాయి.