Sajjala: వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు దారుణంగా ఉంది

ABN , First Publish Date - 2023-07-25T18:29:24+05:30 IST

ప్రైవేట్‌ డిటెక్టివ్‌కైనా ఇంగిత జ్ఞానం ఉంటుంది. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కల్పిత కథలే కనిపిస్తున్నాయి. బేసిక్‌ లాజిక్‌ను సీబీఐ మిస్‌ చేసింది. జగన్‌ను డీమోరలైజ్‌ చేయడానికే వివేకాను చంపారు. కీలక విషయాలను సీబీఐ పట్టించుకోవట్లేదు.

Sajjala: వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు దారుణంగా ఉంది

అమరావతి: మాజీ మంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు దారుణంగా ఉందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. సీబీఐ (CBI) తాజా ఛార్జ్‌షీట్‌ను తప్పుబట్టారు. ‘‘ప్రైవేట్‌ డిటెక్టివ్‌కైనా ఇంగిత జ్ఞానం ఉంటుంది. సీబీఐ ఛార్జ్‌షీట్‌లో కల్పిత కథలే కనిపిస్తున్నాయి. బేసిక్‌ లాజిక్‌ను సీబీఐ మిస్‌ చేసింది. జగన్‌ను డీమోరలైజ్‌ చేయడానికే వివేకాను చంపారు. కీలక విషయాలను సీబీఐ పట్టించుకోవట్లేదు. సిట్‌లు ఇచ్చిన అంశాలను సీబీఐ పక్కనబెట్టేసింది. సీబీఐకి సునీత చెప్పినవన్నీ అబద్ధాలే. నేను, భారతీ కలిసి ఎప్పుడూ సునీత ఇంటికి వెళ్లలేదు. నా భార్యతో కలిసి ఒకసారి పరామర్శకు వెళ్లా.’’ అని సజ్జల వివరించారు.

Updated Date - 2023-07-25T18:29:24+05:30 IST