Home » YuvaGalam
టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర రికార్డును టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధిగమించారు. 2012లో 208 రోజుల్లో 2,817 కిలోమీటర్ల దూరం పాదయాత్రను చంద్రబాబు పూర్తి చేయగా లోకేష్ 206 రోజుల్లో 2,817 కి.మీ లక్ష్యం చేరుకుంది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం బేతపూడి యువగళం క్యాంప్ సైట్ పై అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. 50 మందిని అరెస్ట్ చేసి కైకలూరు నియోజకవర్గం కలిదిండి పోలీస్ స్టేషన్‌కి పోలీసులు తరలించారు.
భీమవరం(Bhimavaram)లో మరోసారి వైసీపీ(YCP) మూకలు రెచ్చిపోయాయి. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) యువగళం పాదయాత్ర(Yuvagalam Padayatra) పైకి వైసీపీ నేత రౌడీషీటర్ సుధ(Rowdy sheeter Sudha) ఉసి కొల్పడంతో రాళ్లదాడికి దిగారు.
గిరిజనులను జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్నారు. వైసీపీ పాలనలో ఎస్టీలపై దాడులు పెరిగాయి. ఎస్టీల భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం(Telugu Desam Govt) వచ్చాక ఇసుక, మట్టిమాఫియాలపై ఉక్కుపాదం మోపుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) హెచ్చరించారు.
టీడీపీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా ముందుకుసాగుతోంది. ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర ప్రభుత్వం సృష్టించిన ఎన్నో ఆటంకాలను ఎదుర్కుంటూ.. ప్రజల ఆశీర్వాదాలతో నేటికి 200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా యువనేతకు టీడీపీ అధ్యిక్షులు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. ఇందులో భాగంగా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లిలో లక్కవరం గ్రామానికి చెందిన మత్స్యకారులు లోకేశ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 194రోజుకు చేరుకుంది. శుక్రవారం నూజివీడు నియోజకవర్గం మీర్జాపురం క్యాంప్ సైట్ నుంచి 194వ రోజు పాదయాత్ర నారా లోకేష్ ప్రారంభించారు.
బాపులపాడు మండలం రంగన్నగూడెంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో కొద్ది సేపు హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నారా లోకేష్ పాదయాత్రలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ వైసీపీ బ్యానర్ ఏర్పాటు చేసింది. బ్యానర్ పై వైసీపీ హయంలో రెండు కోట్ల 71 లక్షల రూపాయలతో పనులు చేసిన వివరాలను వైసీపీ కార్యకర్తలు పొందుపరిచారు.