Nara Lokesh: జగన్ పాలనలో గిరిజనులపై దాడులు పెరిగాయి
ABN , First Publish Date - 2023-08-31T18:11:42+05:30 IST
గిరిజనులను జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్నారు. వైసీపీ పాలనలో ఎస్టీలపై దాడులు పెరిగాయి. ఎస్టీల భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారు.
ఏలూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా కొయ్యలగూడెంలో గిరిజనులతో లోకేశ్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మండిపడ్డారు. ‘‘గిరిజనులను జగన్ సర్కార్ (Jagan Government) నిర్లక్ష్యం చేసింది. ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లిస్తున్నారు. వైసీపీ పాలనలో ఎస్టీలపై దాడులు పెరిగాయి. ఎస్టీల భూములను వైసీపీ నేతలు కబ్జా చేస్తున్నారు. ఎస్టీలకు రాజకీయంగా మెరుగైన అవకాశాలు కల్పించాలి. ప్రత్యేక ప్రణాళికతో ఇళ్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. రోడ్ల అనుసంధానం, మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. తండాలకు రహదారులు ఏర్పాటు చేస్తాం.’’ అని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.