Nara Lokesh: ఇసుక, మట్టిమాఫియాలపై ఉక్కుపాదం
ABN , First Publish Date - 2023-08-31T14:50:40+05:30 IST
తెలుగుదేశం ప్రభుత్వం(Telugu Desam Govt) వచ్చాక ఇసుక, మట్టిమాఫియాలపై ఉక్కుపాదం మోపుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) హెచ్చరించారు.
ఏలూరు: తెలుగుదేశం ప్రభుత్వం(Telugu Desam Govt) వచ్చాక ఇసుక, మట్టిమాఫియాలపై ఉక్కుపాదం మోపుతామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) హెచ్చరించారు. గురువారం నాడు కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం గ్రామస్తులు లోకేష్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.10 గ్రామాలను కలిపే సరిపల్లి రోడ్డు, కేతవరం రోడ్డు అధ్వానంగా ఉన్నాయన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్(CM JAGAN)నేతృత్వంలోనే ఇసుకమాఫియా(Sand Mafia) పేట్రేగిపోతోందన్నారు. జగన్, ఆయన సామంతరాజులు ఇప్పటివరకు రూ.40వేల కోట్లరూపాయల ఇసుకను దోచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే మెరుగైన పాలసీ ద్వారా ఇసుకను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్పష్టంచేశారు. గ్రామీణ, పట్టణప్రాంతాలనే తేడా లేకుండా నిరంతరాయంగా విద్యుత్ అందజేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పాడైపోయిన రోడ్లన్నింటినీ పునర్నిర్మిస్తామని నారా లోకేష్ తెలిపారు.