Home » YuvaGalamPadayatra
టీడీపీ (TDP) జాతీయ ప్రాధాన్య కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) అప్రతిహాసంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఒంగోలు జిల్లాలో కొనసాగుతున్న ఈ యాత్ర ఆగస్టు 1న పల్నాడు జిల్లాలోకి అడుగుపెట్టనుంది. జిల్లాలో వినుకొండ నియోజకవర్గం నుంచి ఈ యాత్ర ప్రారంభమవనుంది.
‘‘బాహుబలి సినిమాలో కుంతల రాజ్యం చూశాం. జగన్ అంకుల్ పాలనలో గుంతల రాజ్యం చూస్తున్నాం. చిన్న చిన్న గుంతలు కాదు ఏకంగా లారీ పట్టేంత గుంతలు’’ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ..
ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్‌తో యువగళంలో కొత్త ప్రయోగాన్ని టీడీపీ చేపట్టింది. ఏఐ టెక్నాలజీ ద్వారా కృత్రిమ యాంకర్‌తో వార్తలు చదివేలా డిజైన్ చేశారు. టీడీపీ అనుబంధ విభాగం ఐ టీడీపీ ద్వారా కొత్త కాన్సెప్ట్‌కు శ్రీకారం చుట్టారు.
యువగళం పాదయాత్రపై ఐ ప్యాక్ సభ్యులు నిఘా పెట్టారు. కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్రలోకి ఐ ప్యాక్ సభ్యుడు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఐ ప్యాక్ సభ్యుడిని టీడీపీ క్యాడర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. యువగళం పాదయాత్రలో జరుగుతున్న లైవ్ అప్డేట్స్‌ను, ఎప్పటికప్పుడు ఐ ప్యాక్ సభ్యులు బయటికి చేరవేస్తున్నారు.
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అవినీతిపై సిట్ వేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా కావలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ మేరకు ఆయన మాట్లాడారు. కావలి అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని అన్నారు. యువగళం ప్రభంజనం చూసి జగన్‌కు భయం పట్టుకుందని అన్నారు. జగన్ పాలనలో గంటకో కిడ్నాప్, పూటకో రేప్, రోజుకో హత్య జరుగుతోందని విమర్శలు గుప్పించారు.
యువగళం (Yuvagalam) పాదయాత్రతో ప్రజాక్షేత్రంలోకి దూసుకెళ్తున్న యువ నాయకుడు లోకేష్ యువగళం (Lokesh Yuvagalam) పాదయాత్ర నెల్లూరులో విజయవంతంగా సాగుతోంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న పాదయాత్రలో భాగంగా.. అనిల్ గార్డెన్స్‌లో ‘మహిళా శక్తితో లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సైకాలజిస్ట్, లోకేష్ మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. ప్రస్తుతం గూడూరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఈరోజు తాడిమేడు క్యాంపు సైటు నుంచి 139రోజు పాదయాత్రను లోకేష్ మొదలుపెట్టారు.
యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)లో ఉన్న నారా లోకేశ్ (Nara Lokesh)ను ఆయన మేనమామ, ఎన్టీయార్ తనయుడు నందమూరి రామకృష్ణ (Nandamuri Ramakrishna) శుక్రవారం కలిశారు.
‘‘2014లో ప్రచారానికి వచ్చినప్పుడు.. నేను నా తల్లికి, భార్యకు వెంకటగిరి చీరలు తీసుకెళ్లా. వెంకటగిరి హ్యాండ్లూమ్కి ఒక బ్రాండ్ ఉంది. దానికి కావాల్సింది మార్కెటింగ్ మాత్రమే’’ అని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. డక్కిలిలో చేనేత కార్మికులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు.
మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో ఊరూరా భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు పెనుబర్తి క్యాంపు సైట్ నుంచీ పాదయాత్ర ప్రారంభం కానుంది