Home » Telangana » Assembly Elections
తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల చెలామణి, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) అధికారులను ఆదేశించారు. నార్కోటిక్స్ కంట్రోల్ అంశంపై నేడు డా.బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సమీక్షా సమావేశం జరిగింది.
ప్రస్తుతం జ్యోతి రావు పూలే ప్రజాభవన్‌లో నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌ను ఇకనుంచి ప్రజావాణిగా పిలవాలని సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) ఆదేశించారు.
ఎంపీ పదవికి తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Minister Komati Reddy Venkata Reddy ) రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితమే కోమటిరెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి వచ్చిన వెంటనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాని కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
వరుస రివ్యూలతో సెక్రటేరియట్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy ) బిజీబిజీగా ఉన్నారు. సోమవారం నాడు ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రివ్యూ చేశారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ అధికారులను సీఎం ఆదేశించారు.
తెలంగాణలో ప్రభుత్వ మార్పుపై మావోయిస్టు పార్టీ స్పందించింది. ఈమేరకు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ ఓ లేఖను ఆదివారం నాడు విడుదల చేసింది.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ కార్పొరేషన్ చైర్మన్ల (various corporation chairmens) నియామకాలు, పదవీకాలం పొడిగింపు నిర్ణయాలను రద్దు చేస్తూ రేవంత్ ప్రభుత్వం ( Revanth Govt ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వ విజయం ఆర్థిక శాఖ పైన ఆధారపడి ఉంటుందని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ( Minister Mallu Bhatti Vikramarka ) వ్యాఖ్యానించారు. శనివారం నాడు రాష్ట్ర సచివాలయం ఫైనాన్స్ శాఖ కార్యాలయంలో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో భట్టి విక్రమార్ సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ఆదాయ, వ్యయం, రాష్ట్ర అప్పుల గురించి భట్టి విక్రమార్కకి ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కే రామకృష్ణారావు వివరించారు.
బీఆర్ఎస్ ( BRS ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR ) కి సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో శుక్రవారం నాడు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ పూర్తి చేసిన విషయం తెలిసిందే.
విధి నిర్వహణలో అధికారులు ఆశ్రద్ధ, నిర్లక్ష్యం వహించొద్దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ( Jaggareddy ) అన్నారు. శనివారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో మాట ఇచ్చిన్నట్లు మహిళలకు ఉచిత బస్ పథకం అమలు చేస్తున్నామని జగ్గారెడ్డి తెలిపారు.
ఆర్థిక శాఖను కేటాయించిన తర్వాత తొలిసారిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( Deputy CM Mallu Bhatti Vikramarka ) సెక్రటేరియట్‌కు వచ్చిన సందర్భంగా ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె రామకృష్ణారావు, సెక్రటరీ టి కె. శ్రీదేవి, జాయింట్ సెక్రటరీలు కృష్ణ భాస్కర్, కే హరిత, అడిషనల్ సెక్రటరీ ఆర్ రవి, వివిధ శాఖల ఉన్నత అధికారులు స్వాగతం పలికారు.