Revanth Govt: వివిధ కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలను రద్దు చేసిన రేవంత్ ప్రభుత్వం
ABN , First Publish Date - 2023-12-10T19:25:38+05:30 IST
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ కార్పొరేషన్ చైర్మన్ల (various corporation chairmens) నియామకాలు, పదవీకాలం పొడిగింపు నిర్ణయాలను రద్దు చేస్తూ రేవంత్ ప్రభుత్వం ( Revanth Govt ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వివిధ కార్పొరేషన్ చైర్మన్ల (various corporation chairmens) నియామకాలు, పదవీకాలం పొడిగింపు నిర్ణయాలను రద్దు చేస్తూ రేవంత్ ప్రభుత్వం ( Revanth Govt ) కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీఓని అమల్లోకి తీసుకు రావాలని సీఎస్‌ని ఆదేశించారు. దీంతో ఇప్పటి వరకు ఆయా పదవుల్లో ఉన్న వారందరూ ఇంటి దారి పట్టనున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వ సలహాదారులను రేవంత్ ప్రభుత్వం తొలగించిన విషయం తెలిసిందే.
రేవంత్ ప్రభుత్వం తొలగించింది వీరినే..
1.విజయసింహారెడ్డి
2. తాడికొండ రాజయ్య
3. కొండబాల కోటేశ్వరరావు
4. గట్టు తిమ్మప్ప
5. మార గంగారెడ్డి
6. కంచర్ల రామకృష్ణారెడ్డి
7. వరప్రసాద్ రావు
8. వేద రజిని
9. పిట్టల రవీందర్
10. దూదిమెట్ల బాలరాజు యాదవ్
11. భరత్ కుమార్
12. పల్లె రవికుమార్
13. నంది కంటి శ్రీధర్
14. రవీందర్ సింగ్
15 ఆయాచితం శ్రీధర్
16. ప్రొఫెసర్ కే లింబాద్రి