Komati Reddy : ఎంపీ పదవికి కోమటిరెడ్డి రాజీనామా
ABN , First Publish Date - 2023-12-11T18:44:09+05:30 IST
ఎంపీ పదవికి తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Minister Komati Reddy Venkata Reddy ) రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితమే కోమటిరెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి వచ్చిన వెంటనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాని కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
ఢిల్లీ : ఎంపీ పదవికి తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (
Minister Komati Reddy Venkata Reddy ) రాజీనామా చేశారు. కొద్దిసేపటి క్రితమే కోమటిరెడ్డి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీకి వచ్చిన వెంటనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాని కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందడం ఆ తర్వాత మంత్రిగా పదవి చేపట్టడంతో కోమటిరెడ్డి ఎంపీ పదవీకి రాజీనామా చేశారు. సోమవారం (ఈరోజు) సాయంత్రం 5.30గంటలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాష్ట్ర అధికారులు కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సాయం అందించాలని చెప్పారు. హైదరాబాద్ - విజయవాడ రహదారిని ఆరు లైన్లకు విస్తరించే చర్యలు చేపట్టాలని నితిన్ గడ్కరీని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోరారు.