Home » Telangana » Karimnagar
నగరంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాయలం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ సమస్యలతో ప్రజలు సతమవుతున్నా నగరపాలక సంస్థ పాలకవర్గం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
చదువుతో పాటు క్రీడల్లో రాణించి గురుకులాల ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పిలుపునిచ్చారు. మానకొండూర్ మండలంలోని దేవంపల్లి గురుకుల పాఠశాలలో సోమవారం జోనల్ స్థాయి స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది.
అభివృద్ధి పేరిట పాలకులు చిరు వ్యాపారుల పొట్ట కోడుతున్నార ని, వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
ప్రభుత్వం చేపట్టిన ఇంటిం టి సర్వేను పకడ్బందీగా నిర్వహిస్తూ వివరా లు సేకరించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. కలెక్టర్ శ్రీహర్ష పెద్దపల్లి మండలంలో సోమవారం విస్తృతంగా పర్య టించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పరిశీలించారు.
Telangana: బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష పదవి, కార్యనిర్వహక పదవి , ప్రతిపక్ష పదవి బీసీ లకు, ఎస్సీలకు ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అన్యాయం చేసిన బీఆర్ఎస్ మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతున్న కుల సర్వే దేశ వ్యాప్తంగా జరగాలని డిమాండ్ ఉందన్నారు.
సింగరేణి ఆర్జీ- 3 డివిజన్ పరిధిలోని ఓసీపీ-2ని సింగరేణి డైరెక్టర్(ఈ అండ్ఎం) సత్యనారాయణరావు సందర్శించారు.
రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో నిర్మించనున్న తెలంగాణ ఎస్టీపీపీ స్టేజ్ 2ను తాము వ్యతిరేకిస్తున్నామని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె.రాజన్న స్పష్టం చేశారు.
రామగుండం ఎన్టీపీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమా నికి కృషి చేస్తానని ఎన్బీసీ సభ్యుడు, గుర్తింపు కార్మిక సంఘం సెక్రెటరీ జనరల్ బాబర్ సలీం పాషా తెలిపారు.
రామగుండం ఎన్టీపీసీ ప్రజా సం బంధాల(కార్పొరేట్ కమ్యూనికేషన్) విభాగానికి 3 జాతీయ పురస్కారాలు లభిం చాయి.
ఇంటింటి కుటుంబ సమగ్ర సర్వే రెండో విడత సమాచార సేకరణ ప్రారంభమైంది. శనివారం ఉదయం 9.30 గంటల నుంచే ఎన్యూమరేట్లు తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల నుంచి వారికి కేటాయించిన ఎలక్ర్టోల్ బ్లాక్లకు సర్వేకు సంబంధించిన సామగ్రిని తీసుకు వెళ్ళి ఇంటింటి సమచారాన్ని సేకరించడం ప్రారంభించారు.